Telugu News » CM YS Jagan: మానవతా దృక్పథంతోనే మా ప్రతీ అడుగు: సీఎం జగన్

CM YS Jagan: మానవతా దృక్పథంతోనే మా ప్రతీ అడుగు: సీఎం జగన్

సీఎం(AP CM) వైఎస్ జగన్(YS Jagan) శ్రీకాకుళం జిల్లా(Srikakulam dist) పర్యటనలో కిడ్నీ బాధితుల సమస్యలకు పరిష్కారం చూపుతూ తాగునీటి ప్రాజెక్టును, కిడ్నీ రీసెర్చ్ సెంటర్, ఆస్పత్రిని ఆయన ప్రారంభించారు.

by Mano
Madishetti brothers who handed over to CM Jagan.. will join TDP soon!

మానవతా దృక్పథంతోనే తమ ప్రభుత్వం ప్రతీ అడుగు వేస్తోందని ఏపీ సీఎం(AP CM) వైఎస్ జగన్(YS Jagan)అన్నారు. శ్రీకాకుళం జిల్లా(Srikakulam dist) పర్యటనలో కిడ్నీ బాధితుల సమస్యలకు పరిష్కారం చూపుతూ తాగునీటి ప్రాజెక్టును, కిడ్నీ రీసెర్చ్ సెంటర్, ఆస్పత్రిని ఆయన ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.

CM YS Jagan: Our every step is with a humanitarian perspective: CM Jagan

రూ.700 కోట్లతో హీరమండలం రిజర్వాయర్ నుంచి పైప్ లైన్ ద్వారా ఇచ్చాపురం వరకూ సుద్ధమైన తాగునీటిని అందిస్తున్నామని, అత్యున్నత ప్రమాణాలతో కిడ్నీ రీసెర్చ్ ఆస్పత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. నెప్రాలజీ, యూరాలజి బెడ్స్ ఐసీయూతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ కూడా చేసి చూపించాలని భావిస్తున్నామన్నారు.

అంతర్జాతీయ సంస్థలతో కలసి పనిచేస్తున్నామని చెప్పి సీఎం జగన్.. అన్ని సదుపాయాలు కిడ్నీ రీసర్చ్ సూపర్ స్పెషాలిటీ 375 మంది డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉన్నారని వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లాలో 69డయాలసిస్ యంత్రాలను పెట్టామని చెప్పుకొచ్చారు. కిడ్నీ వ్యాధు గ్రస్తుల బాధలు తన కళ్లారా చూశానని, అధికారంలో వచ్చిన వెంటనే వారికి రూ.2500 ఉన్న పింఛన్‌ను నేడు రూ.10వేలు చేశానని తెలిపారు.

13,143 పెన్షన్లు పెంచడం మొదలు పెట్టామని, కేవలం పింఛన్ల సొమ్మే ప్రతీ నెలా రూ.12కోట్లు దాటిందని చెప్పారు. కిడ్నీ సమస్య తెలుసుకొనేందుకు, కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు అంతర్జాతీయ సంస్థలతో కూడా కలిసి పనిచేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో కిడ్నీ రోగులు ఎక్కడున్నా పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నామన్నారు.

You may also like

Leave a Comment