ఆత్మహత్య (Suicide) నాలుగు అక్షరాల పదమే.. కానీ ఈ ప్రపంచం నుంచి శాశ్వతంగా దూరం చేసే వేపన్.. ఈ ఆలోచనను జయించలేక ఎందరో బలవంతంగా ఊపిరి తీసుకొంటున్నారు.. సమస్య ఏదైనా పరిష్కారం కోసం ప్రయత్నించకుండా.. తీసుకొనే కఠిన నిర్ణయాల వల్ల.. వారితో పాటు.. కుటుంబాన్ని కూడా కనుమరుగు చేస్తున్నారు.
ఇలాంటి ఆలోచనలు ఉన్న వారి కడుపున పుట్టడమేనా తాము చేసిన పాపం అని మరణిస్తోన్న చిన్నారుల ఆత్మలు ఘోషిస్తున్నాయి.. ఇక సిద్దిపేట (Siddipet) జిల్లాలో విషాద ఘటన జరిగింది. చిన్నకోడూర్ (Chinnakodur) మండలం రామునిపట్లలో దారుణం జరిగింది. సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్మెన్ (Collector Gunmen) ఆకుల నరేశ్ ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య చైతన్య, ఇద్దరు పిల్లలు రేవంత్, హిమశ్రీని చంపేసి.. తాను గన్ తో కాల్చుకున్నాడు. ఈ రోజు ఉదయం డ్యూటీకి రాకపోవడంతో సిబ్బంది ఇంటికి వెళ్లి చూడగా నలుగురు రక్తపు మడుగులో కనిపించారు.
మరోవైపు రోజువారీ విధులు నిర్వహించుకొన్న నరేశ్.. ఇంటికి 9ఎంఎం తుపాకీతో వచ్చినట్టు తెలుస్తోంది. తన కుటుంబ సభ్యులను ముందుగా తుపాకీతో కాల్చి తాను ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం.. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.. నరేశ్ కుటుంబ సభ్యులకి సమాచారం అందించినట్టు సమాచారం.. కాగా ఈ ఆత్మహత్యకి కుటుంబ కలహాలే కారణమా? లేక ఆర్థిక సమస్యలా? మరేవైనా సమస్యలు ఉన్నాయా? అనేది తెలియాల్సి ఉంది…