Telugu News » లెబనీస్ అంతర్యుద్ధం నుంచి భారత్ పాఠాలు నేర్చుకోవాలా…!

లెబనీస్ అంతర్యుద్ధం నుంచి భారత్ పాఠాలు నేర్చుకోవాలా…!

అక్కడ అంతర్యుద్ధంతో మెజారిటీ క్రైస్తవుల పరిస్థితి ఏమైంది. అదే పరిస్థితులు భారత్‌ లో వస్తే మన పరిస్థితి ఏంటంటూ హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

by Ramu
Lessons Indians can learn from the Lebanese Civil War

లెబనాన్ (Lebanon) నుంచి భారత్ (India) పాఠాలు నేర్చుకోవాల్సి ఉందని హిందూ సంఘాలు చెబుతున్నాయి. ముస్లింలు మైనార్టీలుగా ఉన్న ఆ దేశం ఆ తర్వాత మెజారిటీ దేశంగా ఎలా మారింది. అక్కడ అంతర్యుద్ధంతో మెజారిటీ క్రైస్తవుల పరిస్థితి ఏమైంది. అదే పరిస్థితులు భారత్‌ లో వస్తే మన పరిస్థితి ఏంటంటూ హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అందుకే, లెబనాన్ అనుభవాల నేపథ్యంలో భారత్ అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నాయి.

Lessons Indians can learn from the Lebanese Civil War

పశ్చిమాసియాలో మధ్యదరా తీరంలో ఒక చిన్న దేశం లెబనాన్. ఆ ప్రాంతంలో ఇజ్రాయెల్‌ ను మినహాయిస్తే మిగిలిన ఏకైక ముస్లిం మైనార్టీ దేశం. ఒట్టోమాన్ సామ్రాజ్య పతనం తర్వాత లెబనాన్, సిరియాలు ఫ్రెంచ్ పాలనలోకి వెళ్లిపోయాయి. ఆ సమయంలో రెండు కలిపి ఒక దేశంలాగా ఉన్నాయి. 1944లో వలస పాలన నుంచి ఆ ప్రాంతానికి విముక్తి లభించింది. ఫ్రెంచ్ పాలన అంతం అయ్యే సమయంలో దేశాన్ని రెండుగా విభజించారు.

అందులో క్రైస్తవులు మెజారిటీగా ఉన్న ప్రాంతం లెబనాన్, ముస్లింలు మెజారిటీ గల ప్రాంతం సిరియాగా మారింది. లెబనాన్ ప్రాంతం ప్రజాస్వామ్యాన్ని విశ్వసించింది. సిరియా మాత్రం నియంతృత్వంపై నమ్మకం పెట్టుకుంది. ఇలా ఏండ్లు గడిచే కొలది పక్క దేశాల నుంచి లెబనాన్ లోకి ముస్లిం శరణార్థుల వలసలు పెరిగాయి. లెబనాన్ ప్రజాస్వామ్య పాలనలో ముస్లిం శరణార్థులకు మెరుగైన సౌకర్యాలు లభించాయి.

ఈ క్రమంలో పక్కనే ఉన్న జోర్డాన్ నుంచి కూడా వలసలు పెరిగాయి. దీంతో ముస్లిం జనాభా భారీగా పెరిగి పోయింది. అలా మొదట పశ్చిమ బీరూట్, ఆ తర్వాత సిడాన్, టైరే ఇలా ఒక్కో ప్రాంతం ఇస్లాం మెజారిటీ ప్రాంతాలుగా మారిపోయాయి. ఈ క్రమంలో క్రైస్తవులు ఒక్కో ప్రాంతం మీద పట్టుకోల్పోయారు. ఇలా ఇరు వర్గాల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. కాలక్రమేణా ఇవి అంతర్యుద్ధానికి దారి తీశాయి. హింస, రక్త పాతం, మారణహోమాలతో ఆ ప్రాంతం అట్టుడికి పోయింది. ఈ యుద్ధంలో పక్కన ఉన్న ముస్లిం దేశాలు, అటు అంతర్జాతీయ సమాజం, వామపక్ష ప్రభుత్వాలు అన్ని కూడా లెబనాన్ వైపే విమర్శలు ఎక్కు పెట్టాయి.

ఇప్పుడు క్రైస్తవులు ఇతర దేశాలకు వలస పోతున్నారు. లెబనాన్‌ తో భారత్ కు దగ్గర పోలికలు ఉన్నాయని హిందూ పెద్దలు చెబుతున్నారు. లెబనాన్ మాదిరిగా భారత్ కూడా బ్రిటీష్ పాలన తర్వాత రెండు ముక్కలైంది. పక్క దేశం బంగ్లాదేశ్, ఇతర దేశాల నుంచి వలసలు పెరుగుతున్నాయని అంటున్నారు. అందువల్ల ప్రభుత్వాలు లెబనాన్ సంక్షోభం నుంచి పాఠాలు నేర్చుకోవాలని, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

You may also like

Leave a Comment