Telugu News » Seethakka : ములుగులో సీతక్క.. పలు విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు..!!

Seethakka : ములుగులో సీతక్క.. పలు విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు..!!

తాను ఏ పదవిలో ఉన్నా.. ఎక్కడ ఉన్నా ములుగు జిల్లా ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామి అవుతానని మంత్రి సీతక్క తెలిపారు.. రాష్ట్ర మంత్రిగా ప్రజల అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం పాటుపడతానని వెల్లడించారు.. కాగా వెనుకబడిన గ్రామాల అభివృద్ధికి దోహద పడే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తోన్నట్టు సీతక్క తెలిపారు..

by Venu

తెలంగాణ (Telangana) రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ములుగుకు వచ్చిన సీతక్క (Seethakka)కు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీతక్క.. ములుగు (Mulugu) నియోజకవర్గ ప్రజల అభిమానాన్ని ఎప్పుడు మరిచిపోనని. మంత్రిని చేసిన ప్రజలందరికి రుణపడి ఉంటానని అన్నారు.

ప్రస్తుతం చేపట్టిన పదవితో ప్రజలకు జవాబు దారిగా సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత నాపై పెరిగిందన్న సీతక్క.. గతంలో కంటే మంత్రిగా నాపై బాధ్యతలు మరింత పెరిగాయని తెలిపారు. ములుగు జిల్లా కేంద్రంలో పర్యటించినా సీతక్క.. నేను ఎక్కడున్నా ములుగే నా కుటుంబం, ములుగు ప్రజలు నా కుటుంబ సభ్యులని వెల్లడించారు. బీఆర్ఎస్ (BRS) పాలనలో కల్వకుంట్ల కుటుంబం మాత్రమే పదవులు అనుభవించిందని విమర్శించిన సీతక్క.. కాంగ్రెస్ (Congress) పాలనలో అందరికీ సమ న్యాయం జరిగేలా రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలిపారు.

తాను ఏ పదవిలో ఉన్నా.. ఎక్కడ ఉన్నా ములుగు జిల్లా ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామి అవుతానని మంత్రి సీతక్క తెలిపారు.. రాష్ట్ర మంత్రిగా ప్రజల అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం పాటుపడతానని వెల్లడించారు.. కాగా వెనుకబడిన గ్రామాల అభివృద్ధికి దోహద పడే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తోన్నట్టు సీతక్క తెలిపారు..

మాట మీద నిలబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తల్లి సోనియమ్మ ఇచ్చిన తెలంగాణలో పది సంవత్సరాల తరువాత ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని సీతక్క గుర్తు చేశారు.. మరోవైపు ములుగులో ఉన్న సీతక్క.. భోజన విరామం అనంతరం జిల్లా అధికార యంత్రాంగంతో మేడారం జాతర రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నారు. తర్వాత ఆదివాసి భవన్ మేడారంలో ప్రెస్ మీట్ నిర్వహించి రాత్రికి ములుగు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బస చేయనున్నట్టు సమాచారం..

You may also like

Leave a Comment