Telugu News » Komati Reddy: రాష్ట్రంలో కుటుంబపాలన అంతమైంది: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

Komati Reddy: రాష్ట్రంలో కుటుంబపాలన అంతమైంది: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

మంత్రి (Minister of Roads and Buildings) కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy) అన్నారు. చిట్యాల-భువనగిరి(Chityala-Bhuvanagiri) రోడ్డు నిర్మాణం త్వరలో ప్రారంభించారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మంత్రికి ఘన స్వాగతం పలికారు.

by Mano
Komati Reddy: Family rule is over in the state: Minister Komati Reddy Venkat Reddy

తెలంగాణ(Telangana)లో కుటుంబపాలన అంతమై ప్రజాపాలన ప్రారంభమైందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి (Minister of Roads and Buildings) కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy) అన్నారు. చిట్యాల-భువనగిరి(Chityala-Bhuvanagiri) రోడ్డు నిర్మాణం త్వరలో ప్రారంభించారు.

Komati Reddy: Family rule is over in the state: Minister Komati Reddy Venkat Reddy

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మంత్రికి ఘన స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన తొలిసారిగా ఇవాళ నకిరేకల్, నల్గొండ నియోజకవర్గాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.

చిట్యాలలోని జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ నిర్మాణానికి జనవరి 2న టెండర్లు ప్రారంభించి సంక్రాంతికి శంకుస్థాపన చేస్తామని చెప్పారు. అయితే, నల్గొండ అభివృద్ధే తమ లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

చిట్యాల మున్సిపాలిటీకి అధిక నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ 11స్థానాల్లో విజయం సాధించి నల్గొండ జిల్లా కాంగ్రెస్‌కు కంచుకోట అని మరోసారి రుజువు చేసిందని కోమటిరెడ్డి అన్నారు. 100 రోజుల్లో ఆరు హామీలు అమలు చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను ఆరు నెలల్లో పూర్తి చేస్తామని తెలిపారు.

You may also like

Leave a Comment