Telugu News » Pallavi Prashanth: బిగ్‌బాస్‌-7 విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్.. 14రోజులు రిమాండ్..!

Pallavi Prashanth: బిగ్‌బాస్‌-7 విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్.. 14రోజులు రిమాండ్..!

బిగ్‌బాస్ హౌస్ నుంచి ప్రశాంత్ బయటకు వస్తున్న క్రమంలో జరిగిన హైడ్రామా తర్వాత.. పల్లవి ప్రశాంత్, అతడి సోదరుడునీ పోలీసులు అరెస్టు చేసి బుధవారం రాత్రి కోర్టుకు తరలించారు.

by Mano
Pallavi Prashanth: Bigg Boss-7 winner Pallavi Prashanth arrested.. remanded for 14 days..!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7(Bigboss-7 Telugu Season) విన్నర్‌గా నిలిచిన పల్లవి ప్రశాంత్‌(Pallavi Prashanth)కు షాక్ తగిలింది. బిగ్‌బాస్ హౌస్ నుంచి ప్రశాంత్ బయటకు వస్తున్న క్రమంలో జరిగిన హైడ్రామా తర్వాత.. పల్లవి ప్రశాంత్, అతడి సోదరుడునీ పోలీసులు అరెస్టు చేసి బుధవారం రాత్రి కోర్టుకు తరలించారు.

Pallavi Prashanth: Bigg Boss-7 winner Pallavi Prashanth arrested.. remanded for 14 days..!

ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం ప్రైవేటు ఆస్తులు ధ్వంసం పలు సెక్షన్ల కింద కేసులో అరెస్ట్ అయిన ప్రశాంత్, అతడి సోదరుడిని గజ్వేల్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు ఆరు గంటల పాటు విచారించిన తర్వాత.. బుధవారం రాత్రి జడ్జి ముందు పల్లవి ప్రశాంత్‌తో పాటు ఆయన సోదరుడిని పోలీసులు ప్రవేశ పెట్టారు. 17వ మెట్రో పాలిటెన్ న్యాయమూర్తి 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు పల్లవి ప్రశాంత్, అతడి సోదరుడిని చంచల్‌గూడా జైలుకు తరలించారు.

బంజారాహిల్స్ ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ… పల్లవి ప్రశాంత్, అతడి సోదరుడు మహావీర్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌ తరలించామన్నారు. 14రోజుల పాటు మెజిస్ట్రేట్ వారు రిమాండ్ విధించినట్లు తెలిపారు. బుధవారం రాత్రి పల్లవి ప్రశాంత్, అతని సోదరుడు మహా విరాన్‌లను గజ్వేల్‌లో అరెస్టు చేసి నేరుగా మెజిస్ట్రేట్ వారి ఎదుట హాజరు పరిచినట్లు వెల్లడించారు. కేసు దర్యాప్తులో ఉందని వివరించారు.

ఈ ఘటనలో మిగతా వారిని గుర్తిస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. అన్నపూర్ణ స్టూడియో దగ్గర గొడవ కేసులో బిగ్ బాస్ కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్‌పై సుమోటోగా కేసు నమోదు చేశామన్నారు. పోలీసులు చెప్పినా వినకుండా, పల్లవి ప్రశాంత్ పెద్ద ఎత్తున ర్యాలీలు చేశారు. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ బందోబస్తుకు వెళ్లిన పోలీసుల కార్లు సహా, ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. పల్లవి ప్రశాంత్, తదితరులపై తొమ్మిది సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని తెలిపారు.

You may also like

Leave a Comment