Telugu News » North Korea : రెచ్చగొడితే అణుదాడి తప్పదు.. హెచ్చరించిన ఉత్తర కొరియా అధ్యక్షుడు..!!

North Korea : రెచ్చగొడితే అణుదాడి తప్పదు.. హెచ్చరించిన ఉత్తర కొరియా అధ్యక్షుడు..!!

ఉత్తర కొరియా అధ్యక్షుడు, మాక్ డ్రిల్‌కు హాజరైన సైనికులను ఉద్దేశించి మాట్లాడుతూ.. అణుదాడి హెచ్చరికలు చేసినట్టు ఉత్తరకొరియా వార్త సంస్థ ఓ కథనం ప్రసారం చేసింది. అణుబాంబులతో ప్రత్యర్థులు తమను రెచ్చగొడితే సంకోచించకుండా అణు బాంబు ప్రయోగించాలని మిసైల్ బ్యూరోకు, కిమ్ జోంగ్ ఉన్ సూచించినట్టు తెలిపింది.

by Venu
Kim Jong Un cries as he requests North Korean women to have more babies

ఉత్తర కొరియా అధ్యక్షుడు తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. మిసైల్ బ్యూరో ఆధ్వర్యంలో ఖండాంతర బాలిస్టిక్ మిసైల్ క్షిపణి (Icbm) ప్రయోగం మాక్ డ్రిల్ లాంఛ్ చేశారు. ఈ సందర్భంగా సైనికులతో కలిసి నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) కీలక వ్యాఖ్యలు చేశారు.. ఉత్తర కొరియా (North Korea )ను అణుదాడితో రెచ్చగొడితే తాము సైతం అణుబాంబు ప్రయోగానికి వెనకాడబోమని వార్నింగ్ ఇచ్చాడు.

Kim Jong Un cries as he requests North Korean women to have more babies

ఉత్తర కొరియా అధ్యక్షుడు, మాక్ డ్రిల్‌కు హాజరైన సైనికులను ఉద్దేశించి మాట్లాడుతూ.. అణుదాడి హెచ్చరికలు చేసినట్టు ఉత్తరకొరియా వార్త సంస్థ ఓ కథనం ప్రసారం చేసింది. అణుబాంబులతో ప్రత్యర్థులు తమను రెచ్చగొడితే సంకోచించకుండా అణు బాంబు ప్రయోగించాలని మిసైల్ బ్యూరోకు, కిమ్ జోంగ్ ఉన్ సూచించినట్టు తెలిపింది.

అయితే, గతవారం వాషింగ్టన్ డీసీ (Washington DC)లో అమెరికా, దక్షిణ కొరియా మధ్య కీలక సమావేశం జరిగింది. ఉత్తర కొరియాతో యుద్ధం తలెత్తిన పక్షంలో అణుబాంబు ప్రయోగ నివారణకు ఏం చేయాలనే దానిపై ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరిగింది.. కాగా ఈ సమావేశం అనంతరం ఉభయ దేశాల నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు.. ఉత్తర కొరియా పై అణుబాంబు ప్రయోగిస్తే, కిమ్ పాలన అంతమైపోతుందని ఘాటుగా విమర్శలు చేశారు.

ఎలాంటి ముందస్తు షరతులు లేకుండా కిమ్ జోంగ్ ఉన్ శాంతి చర్చల్లో పాల్గొనాలని స్పష్టం చేశారు. మరోవైపు ఈ చర్చల్లో బేషరతుగా పాల్గొనాలంటూ దక్షిణ కొరియా, దాని మిత్రదేశాలు కిమ్‌ను కోరిన నేపథ్యంలో ఆయన ఇచ్చిన ఈ హెచ్చరిక అలజడిగా మారింది..

You may also like

Leave a Comment