Telugu News » Rasamayi Balakishan : ప్రస్తుత ఎమ్మెల్యేని హెచ్చరించిన మాజీ ఎమ్మెల్యే..!!

Rasamayi Balakishan : ప్రస్తుత ఎమ్మెల్యేని హెచ్చరించిన మాజీ ఎమ్మెల్యే..!!

బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశానికి.. మాజీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్ కుమార్, రసమయి బాలకిషన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రసమయి.. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యానారాయణ పై మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో దొంగ మాటలు చెప్పి కవ్వంపల్లి గెలిచాడని ఆరోపణలు చేశారు..

by Venu

రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress).. బీఆర్ఎస్ (BRS) నేతల మధ్య మాటల వార్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పటికే అసెంబ్లీ సాక్షిగా నేతలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకొంటున్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ (Rasamayi Balakishan).. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మానకొండుర్ నియోజకవర్గ స్థాయిలో తిమ్మపూర్ మండలం కొత్తపల్లిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌లో హాల్లో గులాబీ నేతలు సమావేశం నిర్వహించారు..

బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశానికి.. మాజీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్ కుమార్, రసమయి బాలకిషన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రసమయి.. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యానారాయణ (Kavvampally Satyanarayana)పై మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో దొంగ మాటలు చెప్పి కవ్వంపల్లి గెలిచాడని ఆరోపణలు చేశారు..

తాను ఎమ్మెల్యేగా ఉన్న పది సంవత్సరాలు ఏ రోజూ కూడా కవ్వంపల్లి మర్యాద ఇవ్వలేదని రసమయి ఆరోపించారు. వాడు వీడు అంటూ ప్రతిరోజూ తనని అసభ్య పదజాలంతో దూషణలకు దిగాడని వెల్లడించారు. ఇకనైనా ఎమ్మెల్యే తన తీరు, భాష మార్చుకోకపోతే తాను కూడా ఆ దారిలోకి వెళతానని, రసమయి బాలకిషన్ హెచ్చరించారు.. ఇప్పుడు ఆయన ఒక ఎమ్మెల్యే.. గౌరవ స్థానంలో ఉన్న ఆయన పద్దతి మార్చుకోక పోతే.. విలువ ఉండదని రసమయి సూచించారు..

You may also like

Leave a Comment