Telugu News » Palla Rajeshwar Reddy : క్రిస్మస్​ గిఫ్ట్​ల పంపిణీపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే..!!

Palla Rajeshwar Reddy : క్రిస్మస్​ గిఫ్ట్​ల పంపిణీపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే..!!

ఈ ఘటనపై ఆగ్రహించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​ రెడ్డి, బీఆర్​ఎస్​ నేతలు.. ఎమ్మెల్యే ఉండగా, డీసీసీ అధ్యక్షుడితో గిఫ్ట్​ల పంపిణీ ఎలా చేస్తారని మండిపడ్డారు.. జనగామ జిల్లా కలెక్టర్​ ఛాంబర్​లో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్​ శివ లింగయ్యతో వాగ్వాదానికి దిగారు.

by Venu

తెలంగాణ (Telangana)లో కాంగ్రెస్ (Congress) అధికారంలోకి రావడంతో సీన్ రివర్స్ అయ్యిందంటున్నారు.. బీఆర్ఎస్ (BRS) హయాంలో కాంగ్రెస్ నేతలు వదిలిన హిట్ డైలాగ్.. అధికారులంతా అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని.. ప్రస్తుతం ఇదే డైలాగ్ బీఆర్ఎస్ నేతల నుంచి వినిపిస్తుండటంతో ఆశ్చర్యం కలుగుతోందని అంతా అనుకొంటున్నారు.. ఈ డైలాగ్ కి కారణం.. క్రిస్మస్​ గిఫ్ట్​ల (Christmas gifts) పంపిణీ కార్యక్రమం.. వివాదానికి దారి తీసిన గిఫ్ట్​ల పంపిణీ కార్యక్రమంలో బీఆర్ఎస్.. కాంగ్రెస్ నేతల మధ్య నిప్పురవ్వ పుట్టిందని తెలుస్తోంది. ఆ వివరాలు చూస్తే..

జనగామ జిల్లా కేంద్రంలో మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా, ప్రభుత్వం అధికారికంగా క్రిస్మస్​ గిఫ్టుల పంపిణీ కార్యక్రమం నిర్వహించింది.. అయితే ఈ కార్యక్రమంలో.. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​ రెడ్డి ( Palla Rajeshwar Reddy) ముఖ్య అతిథిగా గిఫ్ట్ పంపిణీ కార్యక్రమం చేస్తున్నట్లు ముందుగా అధికారులు ప్రకటించారు. అయితే అనుకోకుండా మంత్రి కొండా సురేఖ ఈ కార్యక్రమానికి రాకపోవడంతో డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్​ రెడ్డి చేతుల మీదగా గిఫ్ట్​లు పంచారు.

ఈ ఘటనపై ఆగ్రహించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​ రెడ్డి, బీఆర్​ఎస్​ నేతలు.. ఎమ్మెల్యే ఉండగా, డీసీసీ అధ్యక్షుడితో గిఫ్ట్​ల పంపిణీ ఎలా చేస్తారని మండిపడ్డారు.. జనగామ జిల్లా కలెక్టర్​ ఛాంబర్​లో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్​ శివ లింగయ్యతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్​ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.. క్రిస్మస్​ గిఫ్ట్​ల పంపిణీ కార్యక్రమానికి ఆహ్వానించలేదని అన్నారు..

కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడిని ఎలా స్టేజ్​ మీదకి పిలుస్తారని ప్రశ్నించిన పల్లా రాజేశ్వర్​ రెడ్డి.. ఫ్లెక్సీలో కనీసం తన ఫొటో కూడా వేయలేదని మండిపడ్డారు. తన ఫొటో లేకుండా డీసీసీ అధ్యక్షుడి ఫొటో ఎలా కటౌట్​లో పెడతారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​ రెడ్డి కలెక్టర్​పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు..

You may also like

Leave a Comment