Telugu News » Rachakanda CP: న్యూఇయర్ వేడుకలపై నజర్.. వారికి మద్యం అమ్మితే అంతే..!!

Rachakanda CP: న్యూఇయర్ వేడుకలపై నజర్.. వారికి మద్యం అమ్మితే అంతే..!!

రాచకాండ సీపీ సుధీర్‌బాబు కమిషనరేట్‌లో శనివారం పబ్‌లు, బార్లు, రెస్టారెంట్స్‌, ఫామ్‌హౌస్‌, వైన్‌షాపులు, ఈవెంట్‌ ఆర్గనైజేషన్‌ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. మైనర్లకు మద్యం విక్రయిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

by Mano
Rachakanda CP: Nazar on New Year celebrations.. If you sell them alcohol that's it..!!

నూతన సంవత్సర వేడుకలు(New Year Celebrations) దగ్గర పడుతుండటంతో పోలీస్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అపశ్రుతులు, ప్రమాదాలకు తావులేకుండా పోలీస్‌ యంత్రాంగం చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు ఆంక్షలను జారీ చేశారు.

Rachakanda CP: Nazar on New Year celebrations.. If you sell them alcohol that's it..!!

రాచకాండ సీపీ సుధీర్‌బాబు(Rachakanda CP Sudhir Babu) కమిషనరేట్‌లో శనివారం పబ్‌లు, బార్లు, రెస్టారెంట్స్‌, ఫామ్‌హౌస్‌, వైన్‌షాపులు, ఈవెంట్‌ ఆర్గనైజేషన్‌ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. న్యూఇయర్ వేడుకల సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై చర్చించారు. మైనర్లకు మద్యం విక్రయిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఔట్‌డోర్‌ కార్యక్రమాలకు డీజే, బాణసంచాకు అనుమతి లేదని స్పష్టం చేశారు. పరిమితికి మించి ఈవెంట్‌లోకి ప్రేక్షకులను అనుమతించొద్దని సూచించారు. వేడుకల్లో ఈవెంట్‌ నిర్వాహకులు మాదకద్రవ్యాలు వినియోగించకూడదన్నారు. మహిళలతో అసభ్యకర డ్యాన్సులతో న్యూసెన్స్ చేస్తే ఊరుకునేదిలేదని హెచ్చరించారు.

అదేవిధంగా తాత్కాలికంగా ఫ్లై ఓవర్లను మూసివేయనున్నట్లు తెలిపారు. ఇక న్యూఇయర్‌ను ఆసరాగా చేసుకుని వ్యాపారస్తులు, హోటళ్లు, బేకరీ, స్వీట్‌ షాపుల యజమానులు అధిక ధరలకు విక్రయాలు చేయకూడాదని స్పష్టం చేశారు. ఈ నెల 31న రాత్రి వేడుకలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలన్నారు. ఈ సమావేశంలో డీసీపీలు జానకి, రాజేష్‌ చంద్ర, శ్రీనివాస్‌, గిరిధర్‌, ఇందిర, సాయి శ్రీ, మురళీధర్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment