Telugu News » Dogs Attack in Shaikpet: వీధికుక్కల దాడి.. మరో పసిప్రాణం బలి..!

Dogs Attack in Shaikpet: వీధికుక్కల దాడి.. మరో పసిప్రాణం బలి..!

హైదరాబాద్‌(Hyderabad)లోని షేక్‌పేట(Shekpet)లో మరో ఘటన చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. వీధి కుక్కల దాడిలో ఐదు నెలల పసికందు ప్రాణాలు కోల్పోయాడు.

by Mano
Dogs Attack in Shaikpet: Stray dogs attack.. Another child lost..!

వీధి కుక్కలు మరో చిన్నారి ప్రాణాలను బలి తీసుకున్నాయి. హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో నాలుగేళ్ల బాలుడు, ఖమ్మంలోని రఘునాథపాలెం మండలంలో 5 ఏళ్ల చిన్నారి కుక్కల దాడి(Dogs Attack)లో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలు మరువక ముందే హైదరాబాద్‌(Hyderabad)లోని షేక్‌పేట(Shekpet)లో మరో ఘటన చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.

Dogs Attack in Shaikpet: Stray dogs attack.. Another child lost..!

వీధి కుక్కల దాడిలో ఐదు నెలల పసికందు ప్రాణాలు కోల్పోయాడు. కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడగా వెంటనే ఆసుపత్రిలో చేర్పించి 17రోజులుగా చికిత్స అందిస్తున్నారు. అయితే ఆ బాబు చికిత్స పొందుతూ మృతిచెందడంతో తీవ్ర విషాదం మిగిలింది. వివరాల్లోకి వెళ్తే.. షేక్‌పేటలోని వినోభానగర్‌లో అంజి, అనూష దంపతులు నివాసముంటున్నారు. వీరు కూలీ పనులకు వెళుతూ జీవనం కొనసాగిస్తున్నారు.

డిసెంబర్ 8న తమ 5 నెలల కుమారుడు శరత్‌ను గుడిసెలో పడుకోబెట్టి.. అంజి, అనూషలు పనుల కోసం బయటికి వెళ్లారు. కాసేపటికి వచ్చి చూసేసరికి చిన్నారి తీవ్రంగా గాయపడి.. ఏడుస్తూ కనిపించాడు. వెంటనే నీలోఫర్‌కు అక్కడి నుంచి ఉస్మానియాకు తరలించారు. ఉస్మానియా వైద్యులు చిన్నారి శరత్‌కు శస్త్రచికిత్స చేసి.. ఎన్ఎస్ ఐసీయూలో ఉంచారు.

శస్త్రచికిత్స అనంతరం చిన్నారి 17 రోజుల పాటు మృత్యువుతో పోరాడి.. చివరకు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. కుమారుడి మరణంతో అంజి, అనూష దంపతులు కన్నీరుమున్నీరవుతున్నారు. మూడు వీధి కుక్కలు గుడిసెలోకి చొరబడి చిన్నారిపై దాడి చేసినట్లు సీసీ కెమెరాల్లో గుర్తించారు. వీధికుక్కలు చిన్నారులపై దాడి చేస్తున్నా.. ఏ మాత్రం పట్టనట్లే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

You may also like

Leave a Comment