Telugu News » Munshi: ప్రధాని అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికలకు వెళ్తాం: దీపాదాస్ మున్షీ

Munshi: ప్రధాని అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికలకు వెళ్తాం: దీపాదాస్ మున్షీ

రాష్ట్ర వ్యవహారాల కొత్త ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ(Deepadas Munshi) కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ(Delhi)లో ఆమె మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు.

by Mano
Munshi: We will go to elections without announcing PM candidate: Deepadas Munshi

లోక్‌సభ(Locksabha) ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్(Telangana) రాష్ట్ర వ్యవహారాల కొత్త ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ(Deepadas Munshi) కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ(Delhi)లో ఆమె మీడియాతో  మాట్లాడుతూ.. ప్రధాని అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు.

Munshi: We will go to elections without announcing PM candidate: Deepadas Munshi

మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం కోరుకోవడం మంచి పరిణామమని అన్నారు. జనవరి మొదటి వారంలో తాను తెలంగాణకు వెళ్తానని చెప్పారు.

తెలంగాణ కాంగ్రెస్‌లో కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు అన్ని విషయాలపైనా తనకు పూర్తి అవగాహన ఉందని మున్షీ తెలిపారు. ఎమ్మెల్యేలుగా ఓడిన సీనియర్ల సేవలను కూడా పార్టీ, ప్రభుత్వం ఉపయోగించుకునే విషయంపై పార్టీలో చర్చిస్తానన్నారు. ఈసారి సోనియా ఎక్కడి నుంచి పోటీ చేస్తారో ఇంకా తెలియదన్నారు.

అయితే, గాంధీ కుటుంబం నుంచి ఎవరైనా తెలంగాణ నుంచి పోటీ చేస్తే అది పార్టీకి ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల ఉత్సాహంతో తెలంగాణలో మెజార్టీ ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తామని మున్షీ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్, మజ్లిస్ ఈ మూడు పార్టీలు పరోక్షంగా కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు.

You may also like

Leave a Comment