తమిళ స్టార్ హీరో, డీఎండీకే అధినేత విజయ్‌కాంత్(Vijaykanth) కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన మరోసారి ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. దీంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
విజయకాంత్ అనారోగ్యంతో నవంబర్ 18న చెన్నె(Chennai)లోని మియాట్ ఆసుపత్రి(Miyat Hospital)లో చేరిన విషయం తెలిసిందే. 23రోజుల పాటు ఆయనకు వైద్యం అందించారు. ఆయన కోలుకోవడంతో డాక్టర్ల సూచన మేరకు కెప్టెన్ విజయకాంత్ డిసెంబర్ 11వ తేదీన చెన్నెలోని తన నివాసానికి వెళ్లారు.
అయితే, ఆయన మరోసారి ఆస్పత్రిలో చేరినట్లు వార్తలు రావడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. దీనిపై ఆయన కుటుంబసభ్యులు క్లారిటీ ఇచ్చారు. రెగ్యులర్ చెకప్ కోసమే ఆయనను ఆస్పత్రిలో చేర్పించినట్లు తెలిపారు. మరో రెండు రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని తెలిపారు.
విజయకాంత్ ఆరోగ్య పరంగా ఇప్పటి వరకు అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. శ్వాస సంబంధిత వ్యాధితో కొద్ది రోజులుగా ఇబ్బందిపడుతున్నారు. దీంతో ఆయనను కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. ఈ నేపథ్యంలో ఆయన రెగ్యులర్ చెకప్‌కు ఆస్పత్రి వెళ్తున్నట్లు తెలుస్తోంది.