Telugu News » Vijaykanth: సినీ పరిశ్రమలో ఆయ‌నో లెజెండ్.. విజయకాంత్‌కు ప్రధాని సంతాపం..!

Vijaykanth: సినీ పరిశ్రమలో ఆయ‌నో లెజెండ్.. విజయకాంత్‌కు ప్రధాని సంతాపం..!

త‌మిళ న‌టుడు, డీఎండీకే అధినేత విజ‌య‌కాంత్(Vijayakath) మృతితో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. దీంతో ఆయన మృతిపట్ల ప్రధాని మోదీ(PM Modi) ‘ఎక్స్’లో సంతాపం తెలిపారు.

by Mano
Vijaykanth: He is a legend in the film industry. Prime Minister's condolence for Vijayakanth..!

త‌మిళ న‌టుడు, డీఎండీకే అధినేత విజ‌య‌కాంత్(Vijayakath) మృతితో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. కరోనా బారిన పడిన ఆయన చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాసవిడిచారు. దీంతో ఆయన మృతిపట్ల ప్రధాని మోదీ(PM Modi) ‘ఎక్స్’లో సంతాపం తెలిపారు.

Vijaykanth: He is a legend in the film industry. Prime Minister's condolence for Vijayakanth..!

‘విజయకాంత్ నాకు మంచి మిత్రుడు.. త‌న న‌ట‌న‌తో కోట్ల మంది అభిమానుల‌ను సొంతం చేసుకున్నారు. రాజ‌కీయ నాయ‌కుడిగా ప్ర‌జా సేవ‌లో నిమ‌గ్న‌మ‌య్యారు. ఆయన త‌మిళ‌నాడు రాజ‌కీయాల‌ను ఎంతో ప్ర‌భావితం చేశారు. విజయకాంత్ లేర‌నే విష‌యాన్ని జీర్ణించుకోవ‌డం క‌ష్టంగా ఉంది. ఆయన కుటుంబానికి, అభిమానుల‌కు, అనుచ‌రుల‌కు సానుభూతి తెలియ‌జేస్తున్నా’’ అంటూ ప్రధాని మోడీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. చివరగా ఓం శాంతి అంటూ తన సందేశాన్ని ముగించారు.

అదేవిధంగా విజ‌యకాంత్ మృతి ప‌ట్ల కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ‘‘సినీ, రాజ‌కీయ రంగాల్లో విజ‌య‌కాంత్ విశేష సేవ‌లందించి, ల‌క్ష‌లాది మంది హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు. ఈ క‌ష్ట స‌మ‌యంలో ఆయ‌న కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నా.’’ అని రాహుల్ త‌న ట్వీట్‌ చేశారు.

మార్నింగ్ షోలు రద్దు

విజయకాంత్ మృతితో కోలీవుడ్ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆయన మృతికి సంతాపంగా ఇవాళ(గురువారం) తమిళనాడు వ్యాప్తంగా థియేటర్లలో మార్నింగ్ షోలను రద్దు చేశారు. విజయకాంత్ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో జరపాలని సీఎం స్టాలిన్ అధికారులను ఆదేశించారు.

You may also like

Leave a Comment