Telugu News » Putin: పుతిన్‌తో జైశంకర్ భేటీ.. ప్రధాని మోడీకి ఆహ్వానం..!

Putin: పుతిన్‌తో జైశంకర్ భేటీ.. ప్రధాని మోడీకి ఆహ్వానం..!

రష్యా(Russia) లోని క్రెమ్లిన్‌లో వీరిద్దరూ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. వ‌చ్చే ఏడాది త‌మ దేశానికి రావాలంటూ ప్ర‌ధాని మోడీ(PM Modi)కి పుతిన్ ఆహ్వానం పంపినట్లు జైశంక‌ర్ తెలిపారు.

by Mano
Putin: Jaishankar's meeting with Putin.. Invitation to PM Modi..!

ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌(Putin)ను భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంక‌ర్‌ క‌లిశారు. రష్యా(Russia) లోని క్రెమ్లిన్‌లో వీరిద్దరూ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. వ‌చ్చే ఏడాది త‌మ దేశానికి రావాలంటూ ప్ర‌ధాని మోడీ(PM Modi)కి పుతిన్ ఆహ్వానం పంపినట్లు జైశంక‌ర్ తెలిపారు.

Putin: Jaishankar's meeting with Putin.. Invitation to PM Modi..!

స్నేహితుడు మోడీని మా దేశానికి ఆహ్వానిస్తున్నామ‌ని పుతిన్ అన్నారని వెల్లడించారు. ఈ భేటీలో ఉక్రెయిన్ యుద్ధంపైనా చ‌ర్చించుకున్న‌ట్లు తెలిపారు. ర‌ష్యాలో జైశంక‌ర్ ఐదు రోజుల పర్యటనలో ఉన్నారు. ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ ల‌వ్రోవ్‌ను కూడా ఆయన కలిశారు.

వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న వార్షిక స‌ద‌స్సులో మోడీ, పుతిన్ భేటీ అవుతార‌ని మంత్రి జైశంక‌ర్ వెల్ల‌డించారు. ఆ ఇద్ద‌రు నేత‌లు త‌రుచూ ట‌చ్‌లో ఉన్న‌ట్లు తెలిపారు. పుతిన్ మాట్లాడుతూ.. భార‌త్‌, ర‌ష్యా మ‌ధ్య వాణిజ్య ఆదాయం పెరుగుతోంద‌న్నారు. గ‌తేడాదితో పోలిస్తే ఈ ఏడాది వృద్ధి రేటు అధికంగా ఉన్న‌ట్లు ఆయ‌న చెప్పారు.

ఉక్రెయిన్ సంక్షోభాన్ని ప‌రిష్క‌రించేందుకు ప్ర‌ధాని మోడీ త‌న స్థాయికి తగిన‌ట్లు ప్ర‌య‌త్నం చేశార‌ని పుతిన్ అభినందించారు. శాంతియుతంగా ర‌ష్యా స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకునేందుకు స‌హ‌క‌రిస్తున్న భార‌త్‌కు స‌మాచారాన్ని ఇవ్వ‌డానికి సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ సందర్భంగా వెల్లడించారు.

You may also like

Leave a Comment