మానకొండూరు (Manakondur) కాంగ్రెస్ (Congress) ఎమ్మెల్యే కవ్వంపల్లి చిలిపి చేష్టలు ప్రస్తుతం సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయని అంటున్నారు.. ప్రస్తుతం ఈ ఘటనతో సత్యనారాయణ (Satyanarayana) సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. అసలే ఎమ్మెల్యే.. బాధ్యత గల పదవిలో ఉండి అలా చేయడం ఏంటనే విమర్శలు ఎదుర్కొంటున్నారు.
మానకొండూరు నియోజకవర్గంలో న్యూ ఇయర్ సందర్భంగా వేడుకలు నిర్వహించారు. కాగా జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) హాజరై కేక్ కట్ చేశారు. అనంతరం ఒకరికి ఒకరు కేక్ తినిపించుకొంటూ విష్ చేసుకొన్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే సత్యనారాయణ ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తిస్తూ.. ఆమె చెంపపై కేక్ పూశారు. దీంతో ఆవిడ కాస్త అసౌకర్యంగా ఫీల్ అయినట్లు కనిపించారు.
అయితే ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహిళ పట్ల ఎమ్మెల్యే సత్యనారాయణ ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు ట్వంటీ ట్వంటీ ఆడుతోన్నారు.. మరో బీఆర్ఎస్ లీడర్ రాజయ్యలా తయారవుతోన్న కవ్వంపల్లి.. ఈ కవ్వింపులు ఏంటీ సామి అంటూ ట్రోల్ చేస్తున్నారు. మరోవైపు ఈ వీడియో పై కాంగ్రెస్ స్పందించింది. ఇదంతా బీఆర్ఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారంగా ఆరోపించింది.
ఆ వేడుకల్లో ఉన్న సదరు మహిళ, ఎమ్మెల్యే బంధువేనని సమాధానం ఇచ్చింది. ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తోన్న ఆదరణ చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నేతలు తమ ఎమ్మెల్యేలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడుతోన్నారు.. ఎంత బంధువు అయితే అలా పబ్లిక్ లో ఒక ఎమ్మెల్యే ప్రవర్తించడం సరికాదని నెటిజన్స్ సూచిస్తున్నారు..