ఇంగ్లండ్‌తో సొంత గడ్డపై జరగబోయే టెస్ట్ సీరీస్ నేపథ్యంలో బీసీసీఐ(BCCI) భారత జట్టును ప్రకటించింది. తొలి రెండు టెస్టులకు పదహారు మందితో కూడిన టీమ్‌ను ఎంపిక చేసినట్లు పేర్కొంది. టీమిండియా సారథిగా రోహిత్ శర్మ, జస్రీత్ బుమ్రా వైస్ కెప్టెన్‌గా ఈ జట్టుకు ఎంపిక అయ్యాడు.
ఈ సిరీస్‌కు ఇషాన్ కిషన్‌పై వేటు పడింది. ఇక, కొత్త కుర్రాడు ధ్రువ్ జురెల్ వికెట్ కీపర్ కోటాలో స్థానం దక్కించుకున్నాడు. కాగా, జనవరి 25 నుంచి టీమిండియా- ఇంగ్లండ్ జట్ల మధ్య టెస్టులు స్టార్ట్ కానున్నాయి.
తొలి రెండు టెస్టులకు రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, ధ్రువ్రే జురెల్, యశస్వి జైశ్వాల్, అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, జస్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), ఆవేశ్ ఖాన్ ఎంపికయ్యారు.
అయితే, రంజీ ట్రోఫీలో పుజారా సెంచరీతో రాణించిన టీమిండియా వెటరన్ బ్యాటర్స్ చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానేలకు నిరాశే ఎదురైంది. సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్ట్ సిరీస్‌లో వీరికి చోటు దక్కలేదు. 16 మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో ఉత్తరప్రదేశ్ కుర్రాడు, రాజస్థాన్ రాయల్స్ యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్‌కు అవకాశం దక్కింది. దాదాపుగా సౌతాఫ్రికాతో తలపడినే జట్టునే సెలెక్టర్లు కొనసాగించారు.