భారత్-మాల్దీవుల(Bharath-Maldives) మధ్య వివాదం కొనసాగుతున్న వేళ అందరి దృష్టి లక్షద్వీప్(Lakshadweep) పై మళ్లింది. ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్ పర్యటనకు వెళ్లి అక్కడి అందమైన బీచ్‌లకు సంబంధించిన చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు తెలిసినవే.
అయితే, లక్ష ద్వీప్ వెళ్లాలనుకునేవారికి అలయన్స్ ఎయిర్ లైన్స్ శుభవార్త చెప్పింది. లక్ష ద్వీప్నకు అదనపు విమానాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. లక్షద్వీప్‌కు విమానాన్ని నడిపే ఏకైక విమానయాన సంస్థ ఇదొక్కటే. రోజూ 70-సీట్ల విమానాన్ని ఈ ద్వీపానికి నడుపుతుంది. అయితే, మాల్దీవులకు పర్యాటకుల సంఖ్య పెరగడంతో అదనపు విమానాన్ని నడపనున్నట్లు వెల్లడించింది.
ఇప్పుడు కొచ్చి- అగతి- కొచ్చికి అదనపు విమానాలు అందుబాటులో ఉండనున్నాయి. వారానికి రెండు రోజులు (ఆదివారం, బుధవారం) అదనపు విమానాలు నడుస్తాయని అలయన్స్ ఎయిర్ సీనియర్ అధికారి తెలిపారు. ఇక, అలయన్స్ ఎయిర్ మాత్రమే లక్షద్వీపు విమాన సేవలు అందిస్తోంది. కేరళలోని కొచ్చి, అగతి ద్వీపం మధ్య ప్రయాణం కొనసాగుతుంది. ఈ విమానాశ్రయం లక్షద్వీప్ ద్వీపంలో ఉంది.
విమానం పూర్తి సామర్థ్యంతో ప్రయాణిస్తోంది. మార్చి వరకు అన్ని టిక్కెట్లు అమ్ముడయ్యాయని ఎయిర్‌లైన్స్ అధికారులు తెలిపారు. సోషల్ మీడియాలో లక్షద్వీప్ ట్రెండ్ కావడంతో ఒక్కసారిగా ఆ ద్వీపానికి వెళ్లేందుకు విమాన టిక్కెట్లకు డిమాండ్ భారీగా పెరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ మార్గంలో విమానాల సంఖ్యను మరిన్ని పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.