సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్రాలలో సందడి నెలకొంది. ఇప్పటికే పందెం రాయుళ్ళు బిజీ బిజీగా ఉండగా.. రాష్ట్రాలలో వివిధ చోట్ల పలు క్రీడలు, జోరుగా సాగుతోన్నాయి. ఇప్పటికే కోడిపందాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.. ఇక ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా తమిళనాడు (Tamil Nadu)లో నిర్వహించిన జల్లికట్టు క్రీడ (jallikattu sport)లో అపశృతి చోటు చేసుకొంది.
పోలీసులతో సహా 45 మందికి గాయాలయ్యాయి. ఈ క్రమంలో గాయపడిన వారిని మధురై (Madurai)లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అవనీయపురం (Avaniyapuram) జల్లికట్టు కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మరోవైపు జల్లికట్టు పోటీలో వెయ్యి ఎద్దులు, 600 మంది యువకులు పాల్గొన్నారు. అవనీయపురంలో నిర్వహించిన ఈ పోటీ ప్రాంగణం దగ్గర 8వందల మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
ఈమేరకు వైద్య సేవలు అందించడానికి 20 మెడికల్ టీమ్ లను సిద్దంగా ఉంచారు. ఈ కార్యక్రమం మరో రెండు రోజుల పాటు కొనసాగనుంది. ఇక జల్లికట్టులో ఎద్దులను అదుపు చేసేందుకు ప్రయత్నించిన యువకులను అవి కుమ్మేశాయి.. అంతేకాకుండా బరిలోంచి బయటకు రంకెలేస్తూ ప్రేక్షకుల మీద నుంచి దూకిపారి పోయాయి.. దీంతో ఇద్దర పోలీసులతో సహా 45 మందికి పైగా గాయపడ్డారు. అయితే తొలిరోజు ప్రమాదాలు జరగడంతో ఈసారి మరిన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నారు..