కరోన వచ్చిన తర్వాత నుంచి మనుషుల ప్రాణాలు ఎందుకు పోతున్నాయో అర్థం కాకుండా మారింది. ప్రపంచ వ్యాప్తంగా ఎందరో కారణం లేకుండా ఉన్న పళంగా మరణించడం ఆందోళన కలిగిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనషుల జీవితం నీటి మీది బుడగలా మారింది. అయితే తాజాగా పెద్దపెల్లి (Peddapally)జిల్లా, గోదావరిఖని (Godavarikhani)లో ఇలాంటి ఘటన చోటు చేసుకొంది.
స్థానికంగా నివాసం ఉంటూ కూలీ పనులు చేసుకొని జీవనం సాగిస్తున్న నవీన్, రమేష్ అనే ఇద్దరు స్నేహితులు. బుధవారం పని ముగుంచుకొని.. వస్తున్న క్రమంలో అడ్డగుంటపల్లి (Addaguntapally)లోని, నంబర్ వన్ కల్లు డిపోలో ఉన్న కల్లు తాగారు.. అనంతరం ఇంటికి వెళ్తున్న సమయంలో ఆర్యవైశ్యనగర్ (Aryavaishyanagar) రాగానే రమేష్ కుప్పకూలాడు. దాంతో కంగారుపడిన నవీన్.. రమేష్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. అంతలోనే నవీన్ కూడా కిందపడిపోయాడు.
వీరిద్దరిని గమనించిన చుట్టుపక్కల వారు.. గోదావరిఖని గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఇద్దరు మరణించినట్లు డాక్టర్లు తెలిపారు.. వీరి మరణంతో నవీన్, రమేష్ కుటుంబంలో విషాదఛాయలు అలుముకొన్నాయి. అయితే వీరి మరణానికి కల్తీ కల్లు కారణం అని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరోవైపు కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ అనంతరం ఇద్దరి మరణానికి గల కారణాలు తెలియనున్నట్లు వెల్లడించారు.