Telugu News » Twinkle Khanna: భార్యకు 50ఏళ్ల వయసులో మాస్టర్ డిగ్రీ.. స్టార్ హీరో ఎమోషనల్..!

Twinkle Khanna: భార్యకు 50ఏళ్ల వయసులో మాస్టర్ డిగ్రీ.. స్టార్ హీరో ఎమోషనల్..!

50ఏళ్ల ట్వింకిల్ ఖన్నా తాజాగా మాస్టర్ డిగ్రీ(Mastar Degree) పూర్తి చేసింది. ఈ విషయాన్ని అక్షయ్ కుమార్ సోషల్ మీడియాలో తెలిపాడు. ఇందుకు సంబంధించి ఎమోషనల్ పోస్ట్ చేశాడు.

by Mano
Twinkle Khanna: Master degree at the age of 50 for wife.. Star hero emotional..!

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌(Akshay Kumar) భార్య ట్వింకిల్ ఖన్నా(Twinkle Khanna) గురించి అందరికీ తెలిసిందే. ఒకప్పుడు హీరోయిన్‌గా వెలిగిపోయిన ఆమె పెళ్లి తర్వాత ఇల్లు, పిల్లలతోనే పూర్తి సమయాన్ని కేటాయిస్తోంది. అదేవిధంగా అక్షయ్ సినిమాలకు సంబంధించిన విశేషాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది.

Twinkle Khanna: Master degree at the age of 50 for wife.. Star hero emotional..!

అయితే, 50ఏళ్ల ట్వింకిల్ ఖన్నా తాజాగా మాస్టర్ డిగ్రీ(Mastar Degree) పూర్తి చేసింది. ఈ విషయాన్ని అక్షయ్ కుమార్ సోషల్ మీడియాలో తెలిపాడు. ఇందుకు సంబంధించి ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ‘‘50ఏళ్ల వయసులో ఆమె డిగ్రీ పట్టా పొందారు. మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేయడంపై ఆనందంగా ఉంది.. చదువుకోవాలనుందని రెండేళ్ల క్రితం నువ్వు నాకు చెప్పిన సమయంలో ఆశ్చర్యపోయా.’’ అని అక్షయ్ పేర్కొన్నాడు.

అదేవిధంగా ‘‘ఎంతో కష్టపడి అనుకున్నది సాధించావు. ఇల్లు, కెరీర్, నన్ను, పిల్లలను చూసుకుంటూనే విద్యనభ్యసించావు. నేను సూపర్ విమెన్‌ను పెళ్లి చేసుకున్నా. భర్తగా ఎంత గర్వపడుతున్నానో చెప్పేందుకు నేనూ ఇంకా చదువుకోవాలనుకుంటున్నా. కంగ్రాట్స్ మై లవ్” అంటూ అక్షయ్‌కుమార్ ఎమోషనల్ అయ్యాడు.

ట్వింకిల్ ఖన్నా పట్టా అందుకున్న అనంతరం ఆమెతో కలిసి దిగిన ఫొటోను ట్యాగ్ చేశారు.. ఈ పోస్ట్‌పై సినీ ప్రముఖులు, నెటిజన్లు ఆమెను అభినందిస్తున్నారు.. అక్షయ్ పోస్ట్‌పై తాజాగా స్పందించిన ఆమె.. ఇంతగా ప్రోత్సహించే భర్తను కలిగి ఉండడం నా అదృష్టం” అని అన్నారు.

You may also like

Leave a Comment