అటల్ బిహారి వాజ్ పేయి భారతీయులకు సుపరిచితుడైన వ్యక్తే. ఆయన జీవితంలో రాజ్ కుమారి కౌల్ కి ప్రత్యేక స్థానం ఉంది. అసలు వాళ్లిద్దరూ అంత సన్నిహితులు ఎందుకు అయ్యారో? ప్రేమించిన అమ్మాయిని అటల్ వాజ్ పేయి ఎందుకు పెళ్లి చేసుకోలేదు అనేది ఈ ఆర్టికల్ లో చూద్దాం. గ్వాలియర్‌లోని విక్టోరియా కాలేజీ లో చదువుకుంటున్న టైం లోనే రాజ్ కుమారి కౌల్ కు వాజ్ పేయి పట్ల ప్రత్యేక ఆకర్షణ ఉండేదట. ప్రముఖ జర్నలిస్టు సాగరికా ఘోష్ అటల్ బిహారి వాజ్ పేయి పుస్తకంలో ప్రచురించిన విషయాలు ఇవి. విక్టోరియా కాలేజీలో అమ్మాయిలు చాలా తక్కువ. కౌల్ చాలా అందంగా కూడా ఉండేవారట. ఆమె అంటే వాజ్ పేయి కి కూడా ఇష్టంగా ఉండేది.
ఓ సారి కౌల్ బ్రదర్ చంద్ హక్షర్ వాజ్‌పేయీకి పరిచయం అయ్యారు. అయితే వీళ్ళ పెళ్లి చేయడానికి అటు కౌల్ కుటుంబం కానీ, ఇటు వాజ్ పేయి కుటుంబం గాని ఒప్పుకోలేదు. అయితే కౌల్ కు వేరే సంబంధం చూసారు. దిల్లీలోని రామ్‌జస్ కాలేజీ లో ఫిలాసఫీ చెప్పే లెక్చరర్ నారాయణ్ కౌల్ కు ఇచ్చి వివాహం చేసారు. అయితే నారాయణ్ గారు కూడా కౌల్ గారిని బాగా అర్ధం చేసుకున్నారు. అందుకే ఆయనకు వాజ్ పేయితో స్నేహం గురించి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఎప్పుడూ రాలేదు.
వాజ్ పేయి గురించి కౌల్ గారు ఓపెన్ గానే చెప్పారట. ఓసారి కాలేజీ రోజుల్లోనే కౌల్ గారు ఓ లేఖ రాసి వాజ్ పేయి గారి లైబ్రరీ పుస్తకంలోనే పెట్టారట. కానీ, వాజ్ పేయి గారు ఆ లేఖని చూడలేదు. దీనివల్లనే కౌల్ గారు కూడా ఆయనని ఇష్టపడినట్లు ఆయనకు తెలియదు. ఆ లేఖ వాజ్ పేయికి చేరకపోవడం వల్లే అటల్ బిహారి వాజపేయి తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు. ఆమెను మర్చిపోలేకే.. తన జీవితంలోకి మరొకరిని ఆహ్వానించలేదు.