ఏఐఎంఐఎం (AIMIM) చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై(Asaduddin Owaisi) వీహెచ్ పీ(VHP) జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సాల్ (Vinod Bansal) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.బాబ్రీ మసీదును తమ నుంచి ఒక క్రమపద్దతిలో స్వాధీనం చేసుకున్నారన్న ఓవైసీ వ్యాఖ్యలను ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత 500 ఏండ్లలో మీ పూర్వీకులు ఎవరైనా అయోధ్యను సందర్శించారా అని ప్రశ్నించారు.
ఓవైసీ త్వరలో రామ భక్తుడిగా మారతారని చెప్పారు.త్వరలో ఓవైసీ రామ నామ స్మరణ చేస్తారని సెటైర్ వేశారు. అసదుద్దీన్ ఓవైసీ లండన్ లో బారిస్టర్ చదివారని గుర్తు చేశారు. అలాంటప్పుడు బాబ్రీ మసీదును కాపాడేందుకు ఓవైసీ ఎందుకు కోర్టుకు వెళ్లలేదని ప్రశ్నించారు. ఓవైసీ కేవలం రాజకీయాల కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు.
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ నేపథ్యంలో కర్ణాటకలో ఓవైసీ మీడియాతో మాట్లాడుతూ… బాబ్రీ మసీదును ఒక క్రమ పద్ధతి ప్రకారం స్వాధీనం చేసుకున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. విశ్వహిందూ పరిషత్ ఏర్పాటైన సమయంలో అయోధ్యలో రామాలయం లేదని పేర్కొన్నారు.బాబ్రీ మసీదును కూల్చకుంటే ఈ రోజు జరుగుతున్న వాటిని ముస్లింలు చూడాల్సి వచ్చేది కాదని చెప్పారు.
500 ఏండ్లకు పైగా బాబ్రీ మసీదులో ముస్లింలు నమాజ్ చేశారని వెల్లడించారు. యూపీ ముఖ్యమంత్రిగా జీబీ పంత్ ఉన్న సమయంలో మసీదులో విగ్రహాలను ఉంచారని పేర్కొన్నారు. అయోధ్య కలెక్టర్‌గా ఉన్న నాయర్ అప్పుడు మసీదును మూసివేసి, అక్కడ పూజలు ప్రారంభించారని తెలిపారు. రామ మందిరం గురించి మహాత్మాగాంధీ కూడా ఎప్పుడూ ప్రస్తావించలేదన్నారు.