317 జీవో పట్ల కాంగ్రెస్ (Congress) సర్కార్ సానుకూలంగా ఉందని ప్రొఫెసర్ కొదడం రాం (Kodanda Ram) అన్నారు. ఈ సమస్యను గత ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సమస్యను గుర్తించిందని వెల్లడించారు. 317జీవో వల్ల ప్రభుత్వ ఉద్యోగులకు సమస్య ఏర్పడిన మాట వాస్తవేమనని చెప్పారు.
జీవో వల్ల ప్రభుత్వ ఉపాధ్యాయులే ఎక్కువ శాతం నష్టపోయారని వెల్లడించారు.317 జీవో బాదిత ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్య సాధన అంశాన్ని కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేర్చి,బాదితులను తమ స్వంత జిల్లాలకు పంపిస్తామని ఇటీవల కాంగ్రెస్ అసెంబ్లీలో ప్రస్తావించినందుకు రంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్తు సమావేశం మందిరంలో కృతఙ్ఞత సభ నిర్వహించారు.
ఈ సమావేశంలో ప్రొఫెసర్ కోదండ రాం మాట్లాడుతూ….పని ఓడగొట్టుకోవాలి అంతే కానీ తెగదెంపులు చేస్కో వద్దని సూచించారు. 317 జీవో పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని పేర్కొన్నారు. జిల్లాల్లో ఉన్న మొత్తం పోస్టులకు అక్కడ కేటాయించే పోస్టులకు మధ్య చాలా వ్యత్యాసం ఉందన్నారు. ఇదే ప్రధాన సమస్య అని తెలిపారు.
ఈ సమస్యను అధిగమించగలిగితే చాలా మందిని పలు చోట్ల నియమించవచ్చన్నారు.ఒక కొత్త జిల్లాలో అదనపు మండలాలను చేర్చడం కూడా స్థానికతకు పెద్ద సమస్యగా మారిందని వివరించారు.రెండు మండలాలు కలిపితే వచ్చినటువంటి జిల్లా నుంచి స్థానికత కల్పించడం సమస్యగా తయారైందని అన్నారు. అలకేషన్ సీలింగ్ అనేది తీసి వేస్తే న్యాయం జరుగుతుందని చెప్పారు.