Telugu News » Kunamneni Sambasiva Rao : బీఆర్ఎస్ నిరంకుశ విధానాలు ఇంకా పోవడం లేదు…!

Kunamneni Sambasiva Rao : బీఆర్ఎస్ నిరంకుశ విధానాలు ఇంకా పోవడం లేదు…!

బీఆర్ ఎస్ నిరంకుశ విధానాలు ఇంకా పోవడం లేదన్నారు. అధికారం కోల్పోవడంతో కేటీఆర్ మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు.

by Ramu
A shock to the CPI party.. A case has been registered against MLA Koonanneni!

మంత్రి కేటీఆర్ (KTR) పై సీపీఐ ఎమ్మెల్యే కూనం నేని సాంబ శివరావు (Kunamneni Sambasiva Rao ) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కరెంట్ బిల్లులు కట్టవద్దని కేటీఆర్ చెప్పడం ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు. బీఆర్ ఎస్ నిరంకుశ విధానాలు ఇంకా పోవడం లేదన్నారు. అధికారం కోల్పోవడంతో కేటీఆర్ మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు.

ప్రజా తీర్పును బీఆర్ఎస్ నేతలు అవమానిస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. గ్యారంటీలు వందరోజుల్లో అమలు చేయడం అంటే చట్టబద్దత రావడమని చెప్పారు. వంద రోజులు కూడా కాకముందే కేటీఆర్ విమర్శలు చేస్తున్నారని, అది కేటీఆర్ అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. కొంచెం ఆలస్యం అయినా గ్యారంటీలను కాంగ్రెస్ అమలు చేస్తుందన్నారు

తాము తప్పితే ఎవరికీ పరిపాలించే హక్కులేదనే విధంగా బీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్,బీజేపీ ఒక్కటేనన్న కేటీఆర్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కాంగ్రెస్,బీజేపీ ఎప్పుడూ ఒక్కటి కాలేవని స్పష్టం చేశారు. బీఆర్ఎస్,బీజేపీకి మద్దతిస్తోందని..ఎప్పటికైనా ఆ రెండు పార్టీలు ఒక్కటేనన్నారు. కాంగ్రెస్ తో ఎంఐఎం కలిస్తే తమకేం అభ్యంతరం లేదన్నారు.

తమతో పొత్తు పెట్టుకోకపోవడం వల్లే చత్తీస్ గడ్ లో కాంగ్రెస్ అధికారం కోల్పోయిందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఒక మతానికి నాయకుడిగా వ్యవహరించ వద్దని చెప్పారు. అందరినీ కలుపుకొని పోకుంటే మోడీ నరకానికి వెళతారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ స్నేహ ధర్మం పాటించాలన్నార. తమకు ఒకటి లేదా రెండు స్థానాలు ఇవ్వాలన్నారు.

You may also like

Leave a Comment