Telugu News » AP Politics: కాంగ్రెస్‌లోకి ఎవరొచ్చినా ఇక్కడ జీరోలే: మంత్రి రోజా

AP Politics: కాంగ్రెస్‌లోకి ఎవరొచ్చినా ఇక్కడ జీరోలే: మంత్రి రోజా

by Mano
AP Politics: Whoever joins the Congress is zero here: Minister Roja

ఏపీలో కాంగ్రెస్‌లోకి ఎవరువచ్చినా జీరోలే అవుతారని మంత్రి ఆర్కే రోజా((Minister RK Roja) ఎద్దేవా చేశారు. ఏపీలో ఎన్నికలు(AP Elections) సమీపిస్తున్న వేళ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలు ఛీ కొడితే షర్మిల ఏపీకి వచ్చారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

AP Politics: Whoever joins the Congress is zero here: Minister Roja

రాష్ట్ర ప్రజలు షర్మిలను ఆదరించరని మంత్రి అన్నారు. జగన్ పాలనపై రాష్ట్ర ప్రజలంతా సంతృప్తిగా ఉన్నారని మంత్రి ఆర్కే రోజా తెలిపారు. గతంలో ఎప్పుడూ లేని అభివృద్ధి రాష్ట్రంలో కనిపిస్తోందని అన్నారు. విజయవాడలో అంబేద్కర్ భారీ విగ్రహం, బాపూ మ్యూజియం, భవాని ఐలాండ్ వంటి పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేశామని తెలిపారు.

రాజన్న బిడ్డగా ప్రజలకు రాజన్న రాజ్యం అందించే విషయంలో జగన్ కాంప్రమైజ్ కాలేదని మంత్రి రోజా చెప్పుకొచ్చారు. కాగా, ఏపీలో ఓటు అడిగే నైతిక అర్హత కాంగ్రెస్‌కు లేదని మంత్రి రోజా అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టి, వైఎస్ఆర్ పేరును ఎఫ్ఐఆర్‌లో పెట్టిందని ఆమె ధ్వజమెత్తారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించకుండా ఒక రూమ్‌లో కూర్చుని రాష్ట్రాన్ని విడగొట్టారని విమర్శించారు.

2024 ఎన్నికల్లో జగన్ గెలుపును ఎవరూ ఆపలేరని మంత్రి పేర్కొన్నారు. అయితే, జగన్ సర్కారుపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల చేస్తోన్న విమర్శలకు ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. సంక్రాంతికి వచ్చే డూడూ బసవన్నల్లా కొందరు వస్తుంటారంటూ మంత్రి రోజా షర్మిలపై సెటైర్లు వేశారు. స్థానికత లేని వారిని రాష్ట్ర ప్రజలు ఆదరించరని ఆమె తెలిపారు.

You may also like

Leave a Comment