Telugu News » YS Sharmila: షర్మిలతో వివేకా కుమార్తె భేటీ.. సీఎం జగన్‌పైకి మరో బాణం..?

YS Sharmila: షర్మిలతో వివేకా కుమార్తె భేటీ.. సీఎం జగన్‌పైకి మరో బాణం..?

సీఎం జగన్‌(CM Jagan)పైకి మరో బాణం దూసుకు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల(YS Sharmila)తో మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీత(Sunita) ఇడుపులపాయలో భేటీ అయ్యారు.

by Mano
YS Sharmila: Viveka's daughter's meeting with Sharmila.. Another arrow for CM Jagan..?

ఏపీ(AP)లో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. సీఎం జగన్‌(CM Jagan)పైకి మరో బాణం దూసుకు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల(YS Sharmila)తో మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీత(Sunita) ఇడుపులపాయలో భేటీ అయ్యారు. సునీత కాంగ్రెస్‌లో చేరతారన్న ప్రచారం దృష్ట్యా వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.

YS Sharmila: Viveka's daughter's meeting with Sharmila.. Another arrow for CM Jagan..?

షర్మిల, సునీత మధ్య దాదాపు 2 గంటల పాటు చర్చలు జరిగాయి. పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టిన అనంతరం సునీత ఆమెను కలవడం ఇదే తొలిసారి.అదే విధంగా వైఎస్ షర్మిలతో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సైతం సమావేశమయ్యారు. ఈ భేటీలో సునీత రాజకీయ ప్రవేశంపై చర్చ జరగినట్లు తెలుస్తోంది.

తన తండ్రి వివేకా హత్యపై సునీత తొలి నుంచి గట్టిగా పోరాటం చేస్తున్నారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించి సీబీఐ విచారణ కోరడం, ఆ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చిన తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురు అరెస్టు సైతం అయ్యారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి ఈ కేసులో నిందితులుగా ఉన్నారు.

దీనిపై వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తున్నారు. ఒకవైపు న్యాయపోరాటం చేస్తూనే తన తండ్రిని హత్య చేసిన వ్యక్తులపై రాజకీయంగా పోరాడాలని సునీత భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఇడుపులపాయలోని వైఎస్‌ సమాధికి సునీత, ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డితో కలసి షర్మిల నివాళులర్పించారు.

You may also like

Leave a Comment