Telugu News » Bandi sanjay : తాగి ప్రభుత్వాన్ని నడిపినందుకే కార్ షెడ్ కి పోయింది..!!

Bandi sanjay : తాగి ప్రభుత్వాన్ని నడిపినందుకే కార్ షెడ్ కి పోయింది..!!

కరీంనగర్, ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో ఎంపీ లాడ్స్ నిధుల నుంచి రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన సోలార్ పవర్ ప్లాంట్ ను పరిశీలించిన బండి సంజయ్.. అనంతరం బీఆర్ఎస్ పై మండిపడ్డారు. కేటీఆర్‌ ని బీఆర్ఎస్ పార్టీ పట్టించుకునే పరిస్థితి రాష్ట్రంలో లేదని ఆరోపించారు.

by Venu
bandi sanjay satire on cm kcr

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలంగాణ (Telangana) రాజకీయాలు విమర్శలతో వేడెక్కుతున్నాయి. మూడు ప్రధాన పార్టీల మధ్య పోరులో విమర్శలు ప్రధానంగా మారాయి.. ఇప్పటికే బీఆర్ఎస్ (BRS) అగ్రనేతలు కాంగ్రెస్ (Congress) టార్గెట్ గా ఆరోపణలు చేస్తుండగా.. వారు సైతం ఘాటుగానే స్పందించడం కనిపిస్తోంది. ఇదే సమయంలో పార్ల మెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తున్న బీజేపీ (BJP) సైతం విమర్శలకు దిగింది. ఈ క్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు..

bandi sanjay said state government should declare january 22 as a holidayకరీంనగర్, ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో ఎంపీ లాడ్స్ నిధుల నుంచి రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన సోలార్ పవర్ ప్లాంట్ ను పరిశీలించిన బండి సంజయ్.. అనంతరం బీఆర్ఎస్ పై మండిపడ్డారు. కేటీఆర్‌ ని, బీఆర్ఎస్ ని పట్టించుకునే పరిస్థితి రాష్ట్రంలో లేదని ఆరోపించారు సర్పంచ్ లు చేసిన అభివృద్ధి పనుల కొరకు ఒక్క రూపాయి కూడా . గత ప్రభుత్వం ఇవ్వలేదని.. అప్పుల బాధ తట్టుకోలేక సర్పంచ్ లు ఆత్మహత్య చేసుకొనే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు.

సర్పంచ్ ల గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీ కోల్పోయిందని వ్యాఖ్యానించారు. కాగా పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో పది ఎంపీ సీట్లు బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమి 400, బిజేపి 350 సీట్లు గెలుస్తుందని జోస్యం చెప్పారు. దిక్కులేని నావగా మారిన ఇండియా కూటమి రోజు రోజుకు వెలవెలబోతుందని.. ఎన్నికల వరకు పార్టీలో ఉన్న వారి సంఖ్య తగ్గడం ఖాయమని బండి సంజయ్ (Bandi sanjay) పేర్కొన్నారు..

ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజలు గుర్తుకు వచ్చే కేసీఆర్, కేటీఆర్ కు.. ఎన్నికలు అయిపోగానే ప్రజలు కనిపించడం మానేస్తారని బండి విమర్శించారు.. యాదాద్రిని వ్యాపార కేంద్రంగా మార్చారని, దేవున్ని నమ్మని నాస్తికులకి ఎలా ఓట్లు వేస్తారని అన్నారు.. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి‌ కరీంనగర్ లో అభ్యర్థి లేక పక్క జిల్లా నుంచి తీసుకువచ్చి పోటీ చేయిస్తున్నారని ఎద్దేవా చేశారు.. తాగి ప్రభుత్వాన్ని నడిపినందుకే కారు షెడ్డు కి పోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు పదవీకాలం ముగుస్తున్న సర్పంచులకి కొట్ల రూపాయల అప్పులు ఉన్నవని, కేంద్రం నేరుగా డబ్బులు ఇస్తే, గత ముఖ్యమంత్రి నిధులని దారి మళ్లీంచారని బండి సంజయ్ ఆరోపించారు. ఈ విషయంలో కేసీఆర్ (KCR)పై కేసు నమోదు చెయ్యాలని డిమాండ్ చేశారు. ఏకగ్రీవ పంచాయితీలకు ఇస్తామన్న నిధులు ఇవ్వకుండా సర్పంచులని, గ్రామాల ప్రజల్ని బీఆర్ఎస్ మోసం చేసిందని నిప్పులు చెరిగారు. ఈ క్రమంలో సర్పంచులని ప్రభుత్వం ఆదుకోవాలని సూచించారు..

You may also like

Leave a Comment