Telugu News » Hyderabad : నగరంలో కిలాడి దంపతులు.. పార్లర్ పేరుతో రూ.3 కోట్లు మోసం..!!

Hyderabad : నగరంలో కిలాడి దంపతులు.. పార్లర్ పేరుతో రూ.3 కోట్లు మోసం..!!

రెండు మూడు నెలల పాటు జీతం సరిగానే ఇచ్చారు. ఆ తర్వాతే అసలు క్రైమ్ కథ మొదలైంది. తర్వాత నుంచి జీతం ఇవ్వడానికి రేపు, మాపు అంటూ కాలం గడిపారు.. వస్తాయని ఆశతో వున్న కస్టమర్లకు నిరాశే ఎదురైంది. చివరకు జీతాల కోసం దంపతులకు కాల్ చేయగా ఫోన్లు స్విచ్ఛాఫ్ వచ్చింది.

by Venu

బ్యూటీ పార్లర్ పేరుతో మూడు కోట్ల వసూళ్లు చేసి ఉడాయించిన కిలాడి దంపతుల ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. బ్యూటీ పార్లర్ పేరుతో ఈ మోసానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఇలాంటి క్రైమ్స్ గురించి నిత్యం వార్తలో వస్తున్న విషయాన్ని గమనించకుండా.. పోలీసులు సైతం సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పిస్తున్న, అర్థం చేసుకోకుండా మోసపోయి లబోదిబోమంటూ పోలీసు మెట్లు ఎక్కడం పరిపాటిగా మారింది. ఇక ఈ మోసానికి సంబంధించిన వివరాలు చూస్తే..

హైదరాబాద్ (Hyderabad)లోని ప్రగతినగర్ (Pragathi Nagar) హెడ్ ఆఫీస్ అడ్డాగా, అక్క సమీనా, బావ ఇస్మాయిల్, మరదలు జెస్సికా డబ్బుపై ఆశతో తప్పుడు మార్గాన్ని ఎంచుకొన్నారు. ఈ క్రమంలో నకిలీ బ్యూటీ పార్లర్ ఏర్పాటు చేశారు.. రోజ్ గోల్డ్ బ్యూటీ పార్లర్ (Rose Gold Beauty Parlour) పేరుతో యూ ట్యూబ్ తో పాటు కొన్ని చానెళ్లలో యాడ్స్ సైతం ఇచ్చినట్లు తెలుస్తోంది. అది చూసి వీరిని సంప్రదించిన వారికి మాయమాటలు చెప్పి ఫ్రాంచైజీ తీసుకుంటే నెలకి 35 వేలు జీతం ఇస్తామని నమ్మించారు.

ఈ నేపథ్యంలో రెండు మూడు నెలల పాటు జీతం సరిగానే ఇచ్చారు. ఆ తర్వాతే అసలు క్రైమ్ కథ మొదలైంది. తర్వాత నుంచి జీతం ఇవ్వడానికి రేపు, మాపు అంటూ కాలం గడిపారు.. వస్తాయని ఆశతో వున్న కస్టమర్లకు నిరాశే ఎదురైంది. చివరకు జీతాల కోసం దంపతులకు కాల్ చేయగా ఫోన్లు స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన బాధితులు హెడ్ ఆఫీస్ కు చేరుకొన్నారు. ఆ ఆఫీస్ కు తాళం వేసి ఉండటంతో లబోదిబో మన్నారు.

దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు బాచుపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కేసు నమోదు చేసుకొన్న పోలీసులు, దంపతులకోసం గాలింపు చేపట్టారు. గతంలో సైతం కామారెడ్డి జిల్లాలో చిట్ ఫండ్ పేరుతో కోట్ల రూపాయలు మోసం చేసినట్టు ఆరోపణలు వున్నాయని పోలీసులు నిర్ధారించారు. మరోవైపు ఈ దంపతుల మాయమాటలు నమ్మి కొందరు మంగళ సూత్రాలు అమ్మి, అప్పు చేసి ఫ్రాంచైజీని తీసుకొన్నారు. వీరి వలలో చిక్కుకొన్న కస్టమర్లు ఒక్క నగరంలోనే కాదు.. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో నుంచి కూడా వందల సంఖ్యలో పెట్టుబడులు పెట్టడం గమనార్హం..

You may also like

Leave a Comment