ఇండియన్ నేవీ(Indian Navy) మరో భారీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. రెండు రోజుల వ్యవధిలోనే కొచ్చి సముద్ర తీరంలో సొమాలీ పైరేట్స్ హైజాక్ చేసిన అల్ నహీమ్ బోటును కాపాడింది. భారతీయ యుద్ధ నౌక ఐఎన్ఎస్ సుమిత్ర ఈ ఆపరేషన్‌లో బోటులో ఉన్న 19 మంది పాకిస్థానీలు ఉన్నారు. వారందర్నీ రక్షించినట్లు ఇండియన్ నేవీ ప్రకటించింది.
ఇప్పుడు వారు సురక్షితంగా ఉన్నారని తెలిపింది. 11 మంది సొమాలీ పైరేట్స్‌ను ఆధీనంలోకి తీసుకున్నారు. సొమాలియా తూర్పు తీరంతో పాటు గల్ఫ్ ఆఫ్ ఎడన్‌లో యాంటీ పైరసీ, మారిటైం సెక్యూర్టీ ఆపరేషన్స్, పెట్రోలింగ్ కోసం యుద్ధ నౌక ఐఎన్ఎస్ సుమిత్రను భారతీయ నౌకాదళం మోహరించింది.
కొన్ని రోజుల క్రితమే ఇఆర్‌కు చెందిన ఫిషింగ్ నౌక ఇమాన్‌ను పైరేట్స్ పట్టుకున్నారు. ఆ సమయంలో కూడా ఐఎన్ఎస్ సుమిత్ర రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. ఇక ఇరాన్ జెండా ఉన్న అల్ నహీమ్ నౌకను కూడా పైరేట్స్ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ బోటులో 19 మంది పాకిస్థాన్ సెయిలర్లు ఉన్నారు.
అయితే ఇండియన్ నేవీకి చెందిన సుమిత్ర యుద్ధ నౌక తన రెస్క్యూ ఆపరేషన్ ద్వారా ఆ పాక్ నావికులను రక్షించింది. ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో ఇండియన్ నేవీకి చెందిన మెరైన్ కమాండోలు పాల్గొన్నారు. హిందూ మహాసముద్రం ప్రాంతంలో భారతీయ యుద్ధ నౌకలు ఎప్పుడూ అలర్ట్‌గా ఉంటున్నాయని రక్షణ అధికారులు తెలిపారు.