విశాఖ(Vizag) వేదికగా ఫిబ్రవరి 2నుంచి భారత్ ఇంగ్లాడ్(India vs England) మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా(Team India)కు పెద్ద షాక్ తగిలింది. జట్టు నుంచి జడేజా, కేఎల్ రాహుల్ దూరమవడమే ఇందుకు కారణం. ఇక్కడ రవీంద్ర జడేజా స్థానంలో ముగ్గురు ఆటగాళ్ల మధ్య పోటీ ఉన్నట్లు తెలుస్తోంది.
దీంతో ఈ అవకాశం ఎవరికి దక్కుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఆ ముగ్గురు ఎవరంటే.. కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్. ఈ ముగ్గురూ స్పిన్నర్లే కావడం విశేషం. కుల్దీప్ యాదవ్ టీమిండియా తరపున ఎనిమిది టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. మొత్తం 34 వికెట్లు పడగొట్టాడు. తొమ్మిది ఇన్నింగ్స్‌లు ఆడి 94 పరుగులు తీశాడు. పర్ఫెక్ట్ స్పిన్నర్‌ను రంగంలోకి దింపాలనుకుంటే మాత్రం కుల్దీప్ సరైనోడనే చెప్పాలి.
అదేవిధంగా వాషింగ్టన్ సుందర్ టీమిండియా తరఫున నాలుగు టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఈ స్పిన్నర్ బౌలర్ ఆరు వికెట్లు, 96 రన్స్ తీశాడు. జడ్డూ స్థానంలో మరో ఆల్ రౌండర్‌ను రంగంలోకి దింపితే సుందర్‌కు అవకాశం దక్కుతుంది. ఇక సౌరభ్‌కుమార్ విషయానికి వస్తే.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ స్పిన్ ఆల్ రౌండర్ ఒకసారి టీమ్ ఇండియాలో కనిపించాడు.
కానీ, ఇంతవరకు టీమిండియాలోకి అరంగేట్రం చేసే అవకాశం రాలేదు. ఇప్పుడు మళ్లీ లెఫ్టార్మ్ స్పిన్-ఆల్ రౌండర్‌కు భారత జట్టులో అవకాశం లభించింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సౌరభ్ 68మ్యాచ్‌ల్లో 2061 పరుగులు, 290 వికెట్లు తీశాడు. ఈ రికార్డు ఇంగ్లండ్‌తో జరిగే రెండో టెస్టులో అవకాశం కల్పించవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
భారత టెస్టు జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా , సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, అవేష్ ఖాన్, సౌరభ్ కుమార్.