ఛత్తీస్గఢ్(Chhattisgarh)లోని బీజాపూర్ (Bijapur)లో మావోయిస్టులు, పోలీసుల మధ్య నిన్న జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి చెందగా 15మందికి గాయాలైన విషయం తెలిసిందే.
భద్రతా బలగాలు దంతేవాడ-బీజాపూర్(Dantewada-Bijapur border) బార్డర్ గ్రామాల్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో మావోయిస్టులు(Maoists) ఏర్పాటు చేసుకున్న భారీ బంకర్ బుధవారం బయటపడింది.
బీజాపూర్ జిల్లా టెకల్ గూడెం గ్రామ సమీపంలో ఈ సొరంగాన్ని గుర్తించారు. ఇది కిలోమీటర్ పొడవు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మావోయిస్టులు ఈ సొరంగాన్ని శిక్షణలో భాగంగా ఉపయోగిస్తున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
డీఆర్జీ బృందం ఈ సొరంగాన్ని కూల్చివేసింది. ఇటీవల టేకలగూడెం దాడి తర్వాత నక్సలైట్లు దాక్కొవడానికి నిర్మించినట్లు దంతేవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ వెల్లడించారు.