Telugu News » Kumari Aunty: కుమారి ఆంటీకి రేవంత్‌రెడ్డి గుడ్‌న్యూస్.. డీజీపీకి కీలక ఆదేశాలు..!!

Kumari Aunty: కుమారి ఆంటీకి రేవంత్‌రెడ్డి గుడ్‌న్యూస్.. డీజీపీకి కీలక ఆదేశాలు..!!

తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి(CM Revnth Reddy) ఎక్స్‌ వేదికగా స్పందించారు. కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్‌ను యథావిధిగా అదే ప్రదేశంలో కొనసాగించాలని, ట్రాఫిక్‌ జాం కాకుండా చర్యలు తీసుకోవాలని డీజీపీ(DGP)ని ఆదేశించారు.

by Mano
Kumari Aunty: Revanth Reddy Good news for Kumari Aunty.. Important instructions to DGP..!!

మీమర్స్, టీవీ ఛానళ్ల అత్యుత్సాహం కారణంగా కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్‌(Kumari Aunty Food Stall)ను ట్రాఫిక్ పోలీసులు(Traffic Police) మూసివేసిన సంగతి తెలిసిందే. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు పోలీసులపై తీవ్ర విమర్శలు చేస్తూ కుమారీ ఆంటీకి మద్దతుగా నిలిచారు. ఈ విషయమై తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి(CM Revnth Reddy) ఎక్స్‌ వేదికగా స్పందించారు.

Kumari Aunty: Revanth Reddy Good news for Kumari Aunty.. Important instructions to DGP..!!

కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్‌ను యథావిధిగా అదే ప్రదేశంలో కొనసాగించాలని, ట్రాఫిక్‌ జాం కాకుండా చర్యలు తీసుకోవాలని డీజీపీ(DGP)ని ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాపాలన నడుస్తోందని, పేదల, బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉంటుందని సీపీఆర్వో అయోధ్యరెడ్డి ఎక్స్ ఖాతా (CPRO Ayodhya Reddy X Acoount)లో పేర్కొన్నారు.

అదేవిధంగా స్వయం ఉపాధితో బతుకుతున్న వారికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఆమె తిరిగి హోటల్‌ను నిర్వహించుకునే విధంగా ట్రాఫిక్ పోలీసులు అనుమతి ఇవ్వాలని స్పష్టం చేశారు. ఇనార్‌బిట్‌ మాల్ సమీపంలో ఐటీసీ కోహినూర్‌ దగ్గరలో కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ఉంది. అయితే, త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డి కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్‌కు వెళ్లే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

ఈ క్రమంలో ఆమెకు అనుమతి ఇవ్వడంపై కుమారీ ఆంటీ ఆనందం వ్యక్తం చేసింది. తమ పక్షాన నిలిచిన ప్రభుత్వానికి, సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు చెప్పింది. తాము కూడా నిబంధనల ప్రకారం నడుచుకుంటామని కుమారీ ఆంటీ తెలిపింది. ఆమె ఫుడ్‌స్టాల్ వద్ద ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

You may also like

Leave a Comment