Telugu News » Gas Price Hike : సామాన్యులకు షాక్.. పెరిగిన సిలిండర్ ధర..!!

Gas Price Hike : సామాన్యులకు షాక్.. పెరిగిన సిలిండర్ ధర..!!

జనవరి 1, 2024న 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను ప్రభుత్వ చమురు కంపెనీలు తగ్గించాయి. గత నెలలో ఎల్పీజీ సిలిండర్ ధర తగ్గింపు చాలా తక్కువగా ఉంది. జనవరిలో కూడా 14 కిలోల డొమెస్టిక్ ఎల్‌పిజి సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. డొమెస్టిక్ ఎల్పీజీ రేటులో చివరి మార్పు 30 ఆగస్టు 2023న జరిగింది.

by Venu

లోక్ సభ ఎన్నికలకు (Lok Sabha Elections) సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) నేడు మధ్యంతర బడ్జెట్‌ ను ప్రవేశ పెట్టనున్నారు. కాగా బడ్జెట్‌కు కొన్ని గంటల ముందు ద్రవ్యోల్బణం షాక్ తగిలింది. ఎల్పీజీ సిలిండర్ ధర భారీగా పెరిగింది (LPG Price Hike). ఫిబ్రవరి 1 నుంచి ఎల్పీజీ సిలిండర్ ధరను పెంచుతున్నట్లు చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి.

Commercial LPG cylinders prices increased from today check new rates

అయితే గృహోపకరణాల వంటగ్యాస్ అంటే సబ్సిడీతో కూడిన 14 కిలోల ఎల్‌పిజి సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. కానీ19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరను మాత్రం పెంచుతున్నట్లు.. పెరిగిన ధరలు ఈరోజు నుంచి అమలులోకి వస్తున్నట్లు చమురు సంస్థలు వెల్లడించాయి. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ.14 పెరిగి రూ.1769.50కి చేరింది. కోల్‌కతాలో రూ.18 పెరిగి రూ.1887కి చేరుకొంది. ముంబైలో రూ.15 పెరిగి రూ.1723.50కి, చెన్నైలో రూ.12.50 పెరిగి రూ.1937కి చేరింది.

జనవరి 1, 2024న 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను ప్రభుత్వ చమురు కంపెనీలు తగ్గించాయి. గత నెలలో ఎల్పీజీ సిలిండర్ ధర తగ్గింపు చాలా తక్కువగా ఉంది. జనవరిలో కూడా 14 కిలోల డొమెస్టిక్ ఎల్‌పిజి సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. డొమెస్టిక్ ఎల్పీజీ రేటులో చివరి మార్పు 30 ఆగస్టు 2023న జరిగింది.

మరోవైపు లోక్‌సభ ఎన్నికలకు ముందు, రెండవ పర్యాయం చివరి బడ్జెట్‌ను మోడీ ప్రభుత్వం ఈ రోజు సమర్పించనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉదయం 11 గంటలకు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈమేరకు మధ్యంతర బడ్జెట్‌ కావడంతో పాటు రాబోయే కొద్ది నెలల ప్రభుత్వ ఆదాయ, వ్యయాల లెక్కలను ఇందులో సమర్పించనున్నారు.

You may also like

Leave a Comment