Telugu News » TS Politics: ‘టీడీపీ, కాంగ్రెస్ వేర్వేరు కాదు..’ మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు..!

TS Politics: ‘టీడీపీ, కాంగ్రెస్ వేర్వేరు కాదు..’ మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు..!

ఖమ్మం జిల్లా(Khammam District) తెలుగుదేశం ఆఫీస్‌(TDP Office)లో మంత్రి మాట్లాడారు. కాంగ్రెస్‌ విజయంలో టీడీపీ కార్యకర్తల కృషి ఉందన్నారు.

by Mano
Pongulet: Is looting in the name of development enough?: Minister Ponguleti Srinivas Reddy

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy)సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ(TDP) , కాంగ్రెస్(Congress) వేర్వేరు కాదన్నారు. ఖమ్మం జిల్లా(Khammam District) తెలుగుదేశం ఆఫీస్‌(TDP Office)లో మంత్రి మాట్లాడారు. కాంగ్రెస్‌ విజయంలో టీడీపీ కార్యకర్తల కృషి ఉందన్నారు.

TS Politics: 'TDP and Congress are not different..' Minister Ponguleti's sensational comments..!
తెలంగాణలో మార్పు కావాలని కోరుకున్న ప్రజల అభీష్టం మేరకు కాంగ్రెస్‌కు మద్దతు పలికారన్నారు. టీడీపీకి ఎలాంటి ప్రయోజనం లేకపోయినా అలాంటి నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో తెలుగు తమ్ముళ్లు కాంగ్రెస్‌కు మద్దతు పలికారని చెప్పారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాల్లో ఎక్కడైనా కాంగ్రెస్ నాయకులు ఆదమర్చి నిద్రపోయారేమో కానీ.. తెలుగు తమ్ముళ్లు మాత్రం నిద్రపోలేదన్నాని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ తరఫున టీడీపీ అధినేత చంద్రబాబుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నానన్నారు.

టీడీపీ, కాంగ్రెస్ వేర్వేరు కాదని, భవిష్యత్‌లో అందరం కలిసి పనిచేద్దామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టీడీపీ నేతలతో అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మంత్రి పొంగిలేటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

You may also like

Leave a Comment