Telugu News » America : అమెరికాలో డెమోక్రటిక్‌ ప్రైమరీ ఎన్నికలు.. విజయం సొంతం చేసుకొన్న బైడెన్‌..!

America : అమెరికాలో డెమోక్రటిక్‌ ప్రైమరీ ఎన్నికలు.. విజయం సొంతం చేసుకొన్న బైడెన్‌..!

ఈ గెలుపుతో బిడెన్ తనతో నల్లజాతి పౌరులు ఉన్నారని నిరూపించుకొన్నాడు. ఈ విజయంతో బిడెన్ వర్గంలో మరోసారి ఉత్సాహం నెలకొంది. మరోవైపు.. అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ట్రంప్‌, బైడెన్‌ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

by Venu
Both Hamas and Vladimir Putin want to annihilate neighbouring democracies

అగ్రరాజ్యం అమెరికా (America)లో ఈ ఏడాది అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం జరిగిన సౌత్ కరోలినా ప్రైమరీలో జో బైడెన్ (Joe Biden) విజయం సాధించారు. దాదాపు 55 మంది డెలిగేట్‌లు ఈ పోటీలో పాల్గొన్నప్పటికి చివరికి బైడెన్‌ విజయాన్ని అందకున్నారు. కాగా మారియన్ విలియమ్సన్, డీన్ ఫిలిప్స్‌లు బైడెన్‌కు గట్టి పోటీ ఇచ్చారు.

ఇక, సౌత్ కరోలినా (South Carolina) ప్రైమరీలో విజయం సాధించిన సమయంలో బైడెన్ లాస్ ఏంజెల్స్‌లో నిధుల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిగా ఉండగా, పోటస్ జో బిడెన్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. ఈ క్రమంలో ఇరువురు నేతలు USA అధ్యక్షుడిగా రెండోసారి గెలవాలని తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

ఇందులో భాగంగా డెమొక్రాట్‌ల కోసం వారి అధ్యక్ష నామినేటింగ్ క్యాలెండర్‌లో పేర్కొన్న మొదటి పోటీలో, జో బిడెన్ సౌత్ కరోలినా ప్రైమరీలో భారీ తేడాతో గెలుపొందారు.ఈ గెలుపుతో బిడెన్ తనతో నల్లజాతి పౌరులు ఉన్నారని నిరూపించుకొన్నాడు. ఈ విజయంతో బిడెన్ వర్గంలో మరోసారి ఉత్సాహం నెలకొంది. మరోవైపు.. అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ట్రంప్‌, బైడెన్‌ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

అవకాశం ఉన్న ప్రతీసారి వీరిద్దరూ తీవ్ర విమర్శలు చేసుకొంటున్నారు. అంతకుముందు బైడెన్‌ మాట్లాడుతూ ఇది కేవలం ప్రచారం కాదని, దేశ ప్రయోజనాల కోసం ఈ ప్రచారాన్ని మనం కోల్పోలేమన్నారు. ఏం జరుగుతుందో అమెరికన్లు అర్ధం చేసుకుంటారని వ్యాఖ్యలు చేశారు.

You may also like

Leave a Comment