Telugu News » England Vs India : టీమిండియా ఘన విజయం…. రికార్డు సృష్టించిన అశ్విన్….!

England Vs India : టీమిండియా ఘన విజయం…. రికార్డు సృష్టించిన అశ్విన్….!

దీంతో ఇంగ్లండ్ పై భారత్ 106 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఉప్పల్ మ్యాచ్ పరాజయంతో వెనుకబడిన టీమిండియా తాజాగా విజయంతో సిరీస్‌ను సమం చేసింది.

by Ramu
india defeated england by 106 runs

ఇంగ్లండ్‌ (England)తో రెండో టెస్టులో భారత్ (India) ఘన విజయం సాధించింది. నాల్గవ రోజు భారత బౌలర్లు విజృంభించడంతో ఇంగ్లండ్ 292 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లండ్ పై భారత్ 106 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఉప్పల్ మ్యాచ్ పరాజయంతో వెనుకబడిన టీమిండియా తాజాగా విజయంతో సిరీస్‌ను సమం చేసింది.

india defeated england by 106 runs

 

ఓవ‌ర్‌నైట్ స్కోర్ 67/1తో ఇంగ్లండ్ నాల్గవ రోజు ఆట మొదలు పెట్టింది. ఇంగ్లండ్ జట్టు మరో 28 పరుగులు చేసిన తర్వాత నైట్ వాచ్‌మ‌న్ రెహాన్ అహ్మ‌ద్‌(23) అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ త‌ర్వాత ఓలీ పోప్‌(23)ను అశ్విన్ పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత రెండు బౌండరీలతో జో రూట్ మంచి ఊపు మీద ఉన్నట్టు కనిపించాడు. కానీ కాసేపటికే యష్ బౌలింగ్‌లో రూట్‌(16) ఔట్ అయ్యాడు.

అనంతరం బెయిర్‌స్టో (26)ను బుమ్రా ఎల్బీగా వెన‌క్కి పంపాడు. ఆ తర్వాత జట్టు స్కోరు మరో 40 పరుగులు చేశాక ఓపెనర్ క్రౌలే ఔటయ్యాడు. తర్వాత చివర్లో బెన్ ఫోక్స్, టామ్ హార్ట్‌లీ కాసేపు నిలకడగా ఆడారు. దీంతో భారత బౌలర్లు కాస్త విసిగి పోయారు. కానీ వారిద్దరినీ బుమ్రా ఔట్ చేయడంతో భారత్ ఘన విజయాన్ని అందుకుంది.

అంతకు ముందు తొలి ఇన్నింగ్స్ లో యశస్వీ జైశ్వాల్ (209) డబుల్ సెంచ‌రీ చేయడంతో భారత్ 396 పరుగులు చేసింది. ఇక ఇంగ్లండ్ జట్టు మొదటి ఇన్నింగ్స్ లో 253పరుగులకు ఆలౌట్ అయింది. మొదటి ఇన్నింగ్స్ లోనూ క్రౌలే (76) పరుగులు చేశాడు. రెండవ ఇన్నింగ్స్ లో భారత్ 255పరుగులకు ఆలౌట్ అయింది. భారత్- ఇంగ్లండ్ మూడవ టెస్టు ఫిబ్ర‌వరి 15 నుంచి రాజ్‌కోట్‌లో జ‌రుగ‌నుంది.

ఇది ఇలా వుంటే టీమిండియా ఆల్ రౌండర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ మ‌రో ఘ‌న‌త సాధించాడు. టెస్టు ఫార్మాట్‌లో ఇంగ్లండ్‌‌పై అత్య‌ధిక వికెట్లు తీసిన భార‌త బౌల‌ర్‌గా అశ్విన్ చరిత్ర సృష్టించాడు. వైజాగ్ టెస్టులో ఓలీ పోప్‌‌ను ఔట్ చేసి 96 వికెట్ ను అశ్విన్ తన ఖాతాలో వేసుకున్నాడు. గతంలో ఈ రికార్డు స్పిన్న‌ర్ బీఎస్ చంద్ర‌శేఖ‌ర్ (95 వికెట్లు) పేరిట ఉండేది.

You may also like

Leave a Comment