Telugu News » National Book Fair: నేటి నుంచి 36వ జాతీయ పుస్తక ప్రదర్శన.. ఆ ప్రాంగణానికి గద్దర్ పేరు..!

National Book Fair: నేటి నుంచి 36వ జాతీయ పుస్తక ప్రదర్శన.. ఆ ప్రాంగణానికి గద్దర్ పేరు..!

36వ జాతీయ పుస్తక ప్రదర్శన ఇవాళ ప్రారంభం కానుంది. ఈ పుస్తక ప్రదర్శనను రాష్ట్ర సాంస్కృతి, పర్యాటక, అబ్కారీ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupalli Krishna Rao) ప్రారంభించనున్నారు.

by Mano
National Book Fair: 36th National Book Fair from today.. Name of that premises is Gaddar..!

పుస్తక ప్రియులకు ఇది శుభవార్త అనే చెప్పాలి. ప్రతీ ఏడాది హైదరాబాద్‌(Hyderabad)లో జాతీయ పుస్తక ప్రదర్శన(National Book Fair) నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఎన్నో ఆనవాయితీగా వస్తున్న ఈ బుక్ ఫెయిర్ ఈ ఏడాది 36వ ఎడిషన్‌తో నేడు(శుక్రవారం) ప్రారంభం కానుంది.

National Book Fair: 36th National Book Fair from today.. Name of that premises is Gaddar..!

ఈ పుస్తక ప్రదర్శనను రాష్ట్ర సాంస్కృతి, పర్యాటక, అబ్కారీ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupalli Krishna Rao) ప్రారంభించనున్నారు. దోమలగూడలోని ఎన్టీఆర్ స్టేడియం(NTR Stadium)లో ఇందుకు వేదికైంది. ఈ బుక్ ఫెయిర్ ప్రతీ రోజు మధ్యాహ్నం 2గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కొనసాగనుంది.

శని, ఆదివారాల్లో మాత్రం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 9గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈ పుస్తక ప్రదర్శనలో 365 స్టాళ్లు ఏర్పాటు చేశారు. సాధారణ, ఇంగ్లీషుకు సంబంధించి 214, తెలుగు భాషకు సంబంధించి 115, స్టేషనరీ, హిందీ, ప్రభుత్వ, మీడియా స్టాల్స్ 36, రచయితలకు 6 స్టాల్స్ కేటాయించారు. జాతీయ స్థాయిలో చాలా మంది స్టాల్స్ ఏర్పాటు చేయడం విశేషం.

దీంతో అన్ని భాషల పుస్తకాలు ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉండనున్నాయి. ఈ పుస్తక ప్రదర్శన ప్రాంగణానికి ప్రజా యుద్ధనౌక గద్దర్ పేరు పెట్టినట్లు తెలిపారు. ఈ వేదికకు సంస్కృత పండితులు రవ్వా శ్రీహరి పేరు, ద్వారానికి ఉర్దూ దినపత్రిక సియాసత్ మాజీ ఎండీ జహీరుద్దీన్ అలీ ఖాన్ పేరు పెట్టినట్లు పేర్కొన్నారు.

You may also like

Leave a Comment