Telugu News » Acchampet : అర్ధరాత్రి తహసీల్దార్ ఆఫీస్‌లో హైడ్రామా.. రెడ్ హ్యాండ్ గా దొరికిన ఉద్యోగి-బీఆర్ఎస్ మాజీ సర్పంచ్..!

Acchampet : అర్ధరాత్రి తహసీల్దార్ ఆఫీస్‌లో హైడ్రామా.. రెడ్ హ్యాండ్ గా దొరికిన ఉద్యోగి-బీఆర్ఎస్ మాజీ సర్పంచ్..!

అర్ధరాత్రి 12 గంటల సమయంలో రెవెన్యూ ఉద్యోగి హన్మంతు, బిఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ బొడ్క నాయక్‌తో కలిసి కంప్యూటర్ గదిలో భూములకు సంభందించిన విలువైన పత్రాలను దొంగిలిస్తున్నారంటూ వారు ఆరోపించారు. ఒక బీఆర్ఎస్ నాయకునికి అర్థరాత్రి తహసిల్దార్ ఆఫీసులో ఏం పని ఉంటుందని.. అందులో కంప్యూటర్ గదిలో ఏం చేస్తున్నాడని హనుమంత్ అనే ఉద్యోగిని ప్రశ్నించారు.

by Venu

తెలంగాణ (Telangana)లో బీఆర్ఎస్ (BRS) అధికారం కోల్పోయాక ఎన్నో ఊహకందని చిత్రాలు జరగడం కనిపిస్తున్నాయి.. ప్రస్తుతం ప్రభుత్వ ఆఫీసుల్లో ఉన్న కంప్యూటర్లకు, ఫైళ్లకు భద్రత లేదన్న విషయం సృష్టంగా అర్థం అవుతోందని ఇప్పటికే కాంగ్రెస్ (Congress) నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అయినా బీఆర్ఎస్ నేతల చేతి వాటం మాత్రం ఆగడం లేదని అంటున్నారు.

తాజాగా నాగర్ కర్నూలు (Nagar Kurnool) జిల్లా అచ్చంపేట ( Acchampet) తహసిల్దార్ కార్యాలయంలో అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకోవడం సంచలనంగా మారింది. తహసిల్దార్ కార్యాలయంలో అర్ధరాత్రి రెవెన్యూ ఉద్యోగి, మాజీ సర్పంచ్ ఉండటం పలు అనుమానాలకు తావిస్తుంది. ఇదే విషయాన్ని గమనించిన ఎన్‌ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ నాయకులు.. కార్యాలయంలోని కంప్యూటర్ గదిలో విలువైన పత్రాలను తారుమారు చేస్తున్నట్లు భావించి.. అర్ధరాత్రి ఇక్కడ మీ ఇద్దరు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

అర్ధరాత్రి 12 గంటల సమయంలో రెవెన్యూ ఉద్యోగి హన్మంతు, బిఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ బొడ్క నాయక్‌తో కలిసి కంప్యూటర్ గదిలో భూములకు సంభందించిన విలువైన పత్రాలను దొంగిలిస్తున్నారంటూ వారు ఆరోపించారు. ఒక బీఆర్ఎస్ నాయకునికి అర్థరాత్రి తహసిల్దార్ ఆఫీసులో ఏం పని ఉంటుందని.. అందులో కంప్యూటర్ గదిలో ఏం చేస్తున్నాడని హనుమంత్ అనే ఉద్యోగిని ప్రశ్నించారు. ఈ విషయాన్ని ఎన్‌ఎస్‌యూఐ నాయకులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. వీరిద్దరిపై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మరోవైపు తతంగంపై సీఐ రవీందర్‌ వివరణ ఇచ్చారు.

అర్ధరాత్రి సుమారు 12 :10 గంటల సమయంలో తహసీల్దార్ కార్యాలయంలో హనుమంతు అనే ఉద్యోగి, బొడ్కా నాయక్ అనే మాజీ సర్పంచి ఉన్నారని సమాచారం అందిన వెంటనే అక్కడికి వెళ్లి.. అత్యవసర పనులు చేసేందుకు ఉన్నతాధికారుల ఆదేశాలు ఏమైనా ఉన్నాయా కోరినట్లు తెలిపారు. అయితే అదేమీ లేదన్నట్లు తెలిసిందన్నారు. వెంటనే ఆర్ఐ కృష్ణాజీని పిలిపించామని, తదుపరి విచారణ సంబంధిత అధికారి చేత కొనసాగుతుందని సీఐ రవీందర్‌ తెలిపారు.

You may also like

Leave a Comment