విరాజ్ ఆనంద్ కీలక పాత్రలో, టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం ‘బేబీ’. ఈ మూవీకి సాయి రాజేష్ డైరెక్టర్ గా.. ఎస్కేఎస్ నిర్మాతగా వ్యవహరించారు. కాగా 2023 జూలై 14న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అందుకోంది. అంతేకాకుండా కలెక్షన్స్ పరంగా కూడా భారీగా రాబట్టి బాక్సాఫీసును షేక్ చేసింది.
అయితే తెలుగులో యూత్ ని ఆకర్షించిన ఈ మూవీని హిందీలోనూ రీమేక్ చేస్తున్నట్లు నిర్మాత ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా, డైరెక్టర్ సాయి రాజేష్, నిర్మాత ఎస్కేఎన్పై పోలీసు కేసు నమోదైనట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. వారిద్దరు కాపీ రైట్ చట్టాన్ని ఉల్లంఘించారని శిరిన్ శ్రీరామ్ అనే వ్యక్తి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
తాను ‘ప్రేమించొద్దు’ అనే టైటిల్‌తో స్టోరీ చెప్పానని వెల్లడించిన శిరిన్ శ్రీరామ్.. సాయి రాజేశ్‌ను తన చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పని చేయాలని కోరినట్లు తెలిపాడు. కానీ ఆ స్టోరీనే బేబీ సినిమాలో చూపించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. మరోవైపు ఈ ఫిర్యాదులో నిజమెంత అనేది క్లారిటీ రావాల్సి ఉంది. కాగా, ఈ ఇష్యూ తో ‘బేబీ’ హిందీలో రీమేక్ ఆగిపోతుందని చర్చించుకొంటున్నారు..