బీఆర్ఎస్ పై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy Venkat Reddy) తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. నల్లగొండ ప్రజలు బీఆర్ఎస్ (BRS)ను చెప్పుతో కొట్టినట్టు తీర్పు ఇచ్చారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కోసం మాజీ సీఎం కేసీఆర్ దొంగ దీక్షలు చేశారంటూ నిప్పులు చెరిగారు.
వీటిని చదవండి: CM Revanth Reddy: మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం.. అక్కడే సభకు ఏర్పాట్లు..!
అసెంబ్లీలో సాగు నీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం, ప్రతి పక్షానికి మధ్య మాటల యుద్దం నడిచింది. ఈ చర్చ సందర్భంగా మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ…. తెలంగాణ మలిదశ ఉద్యమానికి కారకులం తామేనని వెల్లడించారు. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని 41 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సోనియా గాంధీని కోరామని ఈ సందర్బంగా గుర్తు చేశారు.
వీటిని చదవండి: దొంగలకు సద్దులు మోయడం మానుకోవాలి.. అసెంబ్లీలో రేవంత్ వర్సెస్ హరీష్ రావు..!..!
కాంగ్రెస్ ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని అన్నారు. అసలు కేసీఆర్కు తెలంగాణకు సంబంధమే లేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రెండు నెలల కిందట అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ స్వల్ప ఓట్ల డిపాజిట్ దక్కించుకోగలిందని ఎద్దేవా చేశారు. అలాంటి పార్టీ నాయకుడు ఏ మొహంతో నల్లగొండలో సభ పెడతారని నిలదీశారు.
నల్లగొండ జిల్లా ముందు తమ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గాంధీనే అని కేసీఆర్ కూడా గతంలో పలు మార్లు అన్నారని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో హరీశ్ రావుకు పెట్రోల్ దొరికిందని గానీ, అగ్గిపెట్టే దొరకలేదంటూ మంత్రి సెటైర్లు వేశారు.