Telugu News » CM Revanth Reddy: మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం.. అక్కడే సభకు ఏర్పాట్లు..!

CM Revanth Reddy: మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం.. అక్కడే సభకు ఏర్పాట్లు..!

పాజెక్టుల(Kaleshwaram Project) విషయంలో గత ప్రభుత్వం చేసిన దోపిడీని బయటపెట్టేందుకు సిద్ధమైంది. ఈ మేరకు మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు మంగళవారం వెళ్లేందుకు సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు సిద్ధమయ్యారు.

by Mano
CM Revanth Reddy: The CM will visit Medigadda project.. Arrangements for the assembly there..!

పాజెక్టుల(Kaleshwaram Project) విషయంలో గత ప్రభుత్వం చేసిన దోపిడీని బయటపెట్టేందుకు సిద్ధమైంది. పాజెక్టుల(Kaleshwaram Project) విషయంలో గత ప్రభుత్వం చేసిన దోపిడీని బయటపెట్టేందుకు సిద్ధమైంది. ఈ మేరకు మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు మంగళవారం వెళ్లేందుకు సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు సిద్ధమయ్యారు.

CM Revanth Reddy: The CM will visit Medigadda project.. Arrangements for the assembly there..!

ఇప్పటికే మంత్రుల బృందం కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను ఓసారి సందర్శించింది. మేడిగడ్డ ప్రాజెక్టులో పిల్లర్లు కుంగిపోవడం, బ్యారేజీ వంగడం, అన్నారం బ్యారేజ్‌లో డిజైన్ లోపాలను ఎత్తి చూపటంపై ప్రధానంగా వారు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ పర్యటన అనంతరం అక్కడే సభ ఏర్పాటు చేసి సీఎం రేవంత్‌రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.

కాళేశ్వరం నిర్వహణకు బీఆర్ఎస్ చేసిన అవినీతిని, అవసరమైన విద్యుత్, ప్రస్తుతం అవుతున్న ఖర్చు, దీనివల్ల సాగునీరు అందుతున్న ఆయకట్టు వివరాలు అన్నింటిని చెప్పనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో బ్యారేజీ దెబ్బతిన్న ప్రాంతాన్ని చదును చేయిస్తున్నారు అధికారులు. అదేవిధంగా కాళేశ్వరం వ్యూ పాయింట్ ప్రాంగణం వద్ద 3వేల మంది కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో పోలీసులు భద్రత ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే ఐజీ శ్రీనివాస్, భూపాలపల్లి ఎస్పీ కిరణ్ కరే మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ఏర్పాట్లను పర్యవేక్షించారు. వాహన తనిఖీలు చేస్తూ కల్వర్టుల వద్ద బాంబు స్క్వాడ్ లతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈనెల 21 నుంచి జరగనుండగా సీఎం రేవంత్‌రెడ్డి వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు తగు ఏర్పాట్లు చేస్తున్నారు.

You may also like

Leave a Comment