Telugu News » Uttam Kumar Reddy: దేశంలోనే అతిపెద్ద కుంభకోణం.. మేడిగడ్డను ఏటీఎంలా వాడుకున్నారు: ఉత్తమ్

Uttam Kumar Reddy: దేశంలోనే అతిపెద్ద కుంభకోణం.. మేడిగడ్డను ఏటీఎంలా వాడుకున్నారు: ఉత్తమ్

దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక జరిగిన అతిపెద్ద కుంభకోణం కాళేశ్వరం ప్రాజెక్టు అని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి(State Irrigation Minister Uttam Kumar Reddy) అన్నారు. తెలంగాణ సీఎంతో పాటు మంత్రులు ఇవాళ మేడిగడ్డ బ్యారేజీ(Medigadda barrage) సందర్శనకు బయల్దేరారు.

by Mano
Uttam Kumar Reddy: The biggest scam in the country.. Madigadda was used as an ATM: Uttam

దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక జరిగిన అతిపెద్ద కుంభకోణం కాళేశ్వరం ప్రాజెక్టు అని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి(State Irrigation Minister Uttam Kumar Reddy) అన్నారు. తెలంగాణ సీఎంతో పాటు మంత్రులు ఇవాళ మేడిగడ్డ బ్యారేజీ(Medigadda barrage) సందర్శనకు బయల్దేరారు. ఈ సందర్భంగా కారులో వెళ్తూ మీడియాతో ఆయన కీలక విషయాలను వెల్లడించారు.

Uttam Kumar Reddy: The biggest scam in the country.. Madigadda was used as an ATM: Uttam

రాష్ట్రంలో సాగునీరు అందించే పరిస్థితి లేదని వెల్లడించారు. రూ.94వేల కోట్ల అప్పు అధిక వడ్డీకి తెచ్చి తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబం డబ్బులు సంపాదించుకోడానికి కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకుందన్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోతే కేసీఆర్ ఒక్క మాట మాట్లాడలేదని అన్నారు. ఇరిగేషన్ శాఖను కేసీఆర్ ఏటీఎంలా వాడుకున్నారని ఆరోపించారు మంత్రి ఉత్తమ్.

బీఆర్ఎస్ హయాంలో మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోయినా బ్యారేజీని ఎవరూ చూడకుండా పోలీసులను కాపలా పెట్టారని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు కూడా వచ్చి ప్రాజెక్టులను చూడాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారనే విషయాన్ని మంత్రి ఉత్తమ్ గుర్తుచేశారు. ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించేందుకే ప్రాజెక్టుల సందర్శన చేపట్టామని స్పష్టం చేశారు.

మేడిగడ్డతో పాటు సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టులు డ్యామేజీలో ఉన్నాయని తెలిపారు. ఇక, కృష్ణాజలాల వాటాలో 2014 నుంచి ఎక్కువ అన్యాయం జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కృష్ణా బ్యాక్ వాటర్ 60శాతం అక్రమంగా తరలిపోతుంటే కేసీఆర్ సైలెంట్‌గా ఉన్నారని తెలిపారు. త్వరలోనే మేడిగడ్డపై అసెంబ్లీలో శ్వేత పత్రం విడుదల చేస్తానని ఆయన వెల్లడించారు.

You may also like

Leave a Comment