Telugu News » Reliance Industries: రికార్డు సృష్టించిన రిలయన్స్.. భారీగా పెరిగిన కంపెనీ షేర్లు..!

Reliance Industries: రికార్డు సృష్టించిన రిలయన్స్.. భారీగా పెరిగిన కంపెనీ షేర్లు..!

దేశంలోని దిగ్గజ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్(Reliance Industries) మరో రికార్డు సృష్టించింది. వారం రోజులుగా కంపెనీ షేర్లు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా 20 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌(Market Capitalization)ను దాటిన దేశంలోనే తొలి కంపెనీగా రిలయన్స్ నిలిచింది.

by Mano
Reliance Industries: Reliance created a record.. Shares of the company increased significantly..!

దేశంలోని దిగ్గజ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్(Reliance Industries) మరో రికార్డు సృష్టించింది. వారం రోజులుగా కంపెనీ షేర్లు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా 20 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌(Market Capitalization)ను దాటిన దేశంలోనే తొలి కంపెనీగా రిలయన్స్ నిలిచింది. మంగళవారం బీఎస్ఈ(BSE) లో 52 వారాల గరిష్ట స్థాయి 1.89 శాతం పెరిగి రూ.2957.80కి చేరుకుంది.

Reliance Industries: Reliance created a record.. Shares of the company increased significantly..!

రూ.20 లక్షల కోట్లను తాకడం ద్వారా భారత మార్కెట్‌లో తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది.  రిలియన్స్ చమురు నుంచి టెలికాం రంగానికి విస్తరించి ఉన్న కంపెనీ విభిన్న పోర్ట్‌పోలియో కారణంగా దాని స్థానం నిరంతరం బలపడుతోంది. ఒక రోజు ముందు హురున్ ఇండియా 500 జాబితాలో రిలయన్స్ ఆధిపత్యం కనిపించింది. వరుసగా మూడో ఏడాది కంపెనీ మొదటి స్థానంలో నిలిచింది.

టీసీఎస్ రెండో స్థానంలో, హెచ్ఐఎఫ్‌సీ బ్యాంక్ మూడో స్థానంలో నిలిచాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్స్ జనవరి 29 నాటికే రూ.19 లక్షల కోట్లకు చేరుకున్నాయి. 2024 సంవత్సరంలో రిలయన్స్ గురించి పెట్టుబడిదారులలో విపరీతమైన ఉత్సాహం ఉంది. ఈ కొద్ది రోజుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు దాదాపు 14 శాతం మేర పెరిగాయి. కంపెనీ అద్భుతమైన పనితీరు కారణంగా గత 12 నెలల్లో షేర్లు దాదాపు 40 శాతం మేర పెరిగాయి.

రెండు వారాల్లో రూ.లక్ష కోట్లు విలువ గత రెండు వారాల్లోనే కంపెనీ స్టాక్ మార్కెట్ క్యాప్ సుమారు రూ.లక్ష కోట్లు పెరిగింది. ఆర్ఎఎల్ అనుబంధ సంస్థ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇందులో గణనీయమైన సహకారం  దించింది. ఈ కాలంలో జియో మార్కెట్ క్యాప్ రూ.1.70లక్షల కోట్లు పెరిగింది. ఇది విభజనకు ముందు రేటుకు చేరుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 2015 నుంచి వార్షిక ప్రాతిపదికన పెట్టుబడిదారులకు సానుకూల రాబడిని అందిస్తోంది.

You may also like

Leave a Comment