ఏపీలో వరుణుడు విజృంభిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం ఏపీ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు (heavy rains) కురిశాయి. ఇప్పటికి కొన్ని చోట్ల భారీ ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణశాఖ (imd) మరో కీలక విషయాన్ని వెల్లడించింది. నైరుతి,పశ్చిమ గాలుల ప్రభావంతో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయని తెలిపారు.
శనివారం ఉత్తర,దక్షిణ కోస్తాంధ్రలో అనేక చోట్ల, అదే విధంగా రేపు ఆదివారం కొన్ని చోట్ల వర్షాలు భారీగా పడనున్నాయి. ఇక రాయలసీమలో శని,ఆదివారాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.
ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు కురిస్తాయని.. అంతే కాకుండా పిడుగులు కూడా పడొచ్చని అధికారులు అలర్ట్ జారీ చేశారు. దీంతో ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రైతాంగం తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
శనివారం ఉత్తర,దక్షిణ, కోస్తాంధ్ర లో అనేక చోట్ల అదే విధంగా ఆదివారం కొన్ని చోట్ల అలాగే రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ కూడా హెచ్చరికలు జారీ చేసింది. శుక్రవారం విజయనగరం, శ్రీకాకుళం, సంతబొమ్మాళి, విశాఖ భీముని పట్నంలో భారీ వర్షాలు కురిశాయి.