Telugu News » Janasena : పిఠాపురంలో ఊహించని ట్విస్ట్.. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ వెనక్కి?

Janasena : పిఠాపురంలో ఊహించని ట్విస్ట్.. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ వెనక్కి?

ఏపీ రాజకీయాలు(Ap politics) రసవత్తంగా మారాయి. మొన్నటివరకు తప్పకుండా అధికారంలోకి వస్తామని అనుకున్న వైసీపీ(YCP) అభ్యర్థులు ప్రస్తుతం ముందువెనక అవుతున్నారు.టీడీపీ(TDP),జనసేన(Janasena), బీజేపీ(BjP) కూటమికి క్రమంగా మద్దతు పెరుగుతూ వస్తున్న క్రమంలో వారిలో ఆత్మస్థైర్యం తగ్గిపోతున్నట్లు కనిపిస్తోంది.

by Sai
Unexpected twist in Pithapuram.. YCP MLA candidate's nomination withdrawn?

ఏపీ రాజకీయాలు(Ap politics) రసవత్తంగా మారాయి. మొన్నటివరకు తప్పకుండా అధికారంలోకి వస్తామని అనుకున్న వైసీపీ(YCP) అభ్యర్థులు ప్రస్తుతం ముందువెనక అవుతున్నారు.టీడీపీ(TDP),జనసేన(Janasena), బీజేపీ(BjP) కూటమికి క్రమంగా మద్దతు పెరుగుతూ వస్తున్న క్రమంలో వారిలో ఆత్మస్థైర్యం తగ్గిపోతున్నట్లు కనిపిస్తోంది. సీఎం జగన్ అందించిన పాలన, నవరత్నాలు,వాలంటీర్ వ్యవస్థ, సంక్షేమ పథకాలే తమ పార్టీని గెలిపిస్తాయని ధీమాగా ఉన్న వారంతా ప్రస్తుతం లోలోపల భయపడుతున్నట్లు తెలుస్తోంది.

Unexpected twist in Pithapuram.. YCP MLA candidate's nomination withdrawn?

ఇదిలాఉండగా, జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఊహించని మలుపు చోటుచేసుకుంది. మొన్నటివరకు జనసేన పార్టీలో పిఠాపురం నియోజకవర్గ ఇంచార్జిగా ఉన్న వంగా గీత.. పవన్ కళ్యాణ్ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారని, తనకు సీటు రాలేదని మనస్తాపంతో అధికార వైసీపీ పార్టీలో చేరారు.

ఎన్నికల ప్రచారంలో కూడా జోరుగా పాల్గొన్నారు. అనంతరం నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి చేశారు. అయితే, ప్రస్తుతం తన నామినేషన్‌ను వెనక్కి తీసుకోవాలని వంగా గీత ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

అయితే, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి వస్తున్న జానాధరణ, ఆయన నామినేషన్ రోజున వచ్చిన జనాన్ని ఆమె ఆందోళనకు గురైనట్లు సమాచారం. ఆమె సన్నిహితులు కూడా ఇదే విషయాన్ని స్పష్టంచేసినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ చేతిలో ఓటమిని సహించడం ఇష్టం లేక నామినేషన్ వెనక్కి తీసుకోవాలని వంగా గీత భావిస్తున్నట్లు సోషల్ మీడియాలోనూ జోరుగా ప్రచారం సాగుతోంది.

You may also like

Leave a Comment