Telugu News » Telangana Assembly Session 2024 : కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఉపయోగం లేదు.. వెల్లడించిన కాగ్.. రాష్ట్రాన్ని ఎంత మోసం చేశారు..!

Telangana Assembly Session 2024 : కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఉపయోగం లేదు.. వెల్లడించిన కాగ్.. రాష్ట్రాన్ని ఎంత మోసం చేశారు..!

ప్రతీ సంవత్సరం 700 కోట్ల నుంచి 14 వేల 5 వందల కోట్ల వరకు ప్రాజెక్టు నిర్వహాణ కోసం ఖర్చు అవుతుందని తెలిపిన కాగ్.. కాళేశ్వరం 56 పనుల్లో 13 పూర్తి అయ్యాయయని మిగిలనవి పూర్తి కావాల్సి ఉందని పేర్కొంది. 2020-21లోనే రుణాల చెల్లింపు ప్రారంభం కావాల్సి ఉందని కానీ 9 ఆగ్రిమెంట్ లను వాయిదా వేయాలని కోరినట్టు చెప్పింది.

by Venu

తెలంగాణ (Telangana) అసెంబ్లీ సమావేశాలు (Assembly Session) ప్రారంభమయ్యాయి. ఈ ఉభయ సభల్లో కాళేశ్వరం (kaleshwaram) ప్రాజెక్టుపై కాగ్ రిపోర్ట్‌ను సర్కార్ సభలో పెట్టింది. ప్రాణహిత ప్రాజెక్టు లో ఎలాంటి పురోగతి లేదు దీనికోసం కేటాయించిన 878 కోట్లు నిష్ఫలంగా మారిపోయాయని వెల్లడించారు. డబ్బులు రీ ఇంజనీరింగ్ పేరుతో వృధా చేశారని నివేదికలో పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్ లో 63 వేల 352 కోట్లు చూపెట్టగా.. లక్షా 6 వేల కోట్లకు అంచనా వ్యయం పెంచినట్లు కాగ్ తన నివేదికలో స్పష్టం చేసింది.

Kaleswaram Project Defects

ఇదే సమయంలో మొత్తం ప్రాజెక్టు పూర్తయ్యే వరకు లక్షా 47 వేల 427 కోట్లు ఖర్చు అవుతుందని పేర్కొంది. ఇందుకోసం భారీగా రుణాలు తీసుకువచ్చారని తెలిపింది. 15 బ్యాంకులతో 87 వేల కోట్లు సమకూర్చుకోవాలని ఓప్పందం చేసుకొన్నట్లు తెలిపింది. గత ప్రభుత్వం రుణాలు చెల్లించడం లో కాలయాపన చేసిందని.. రుణాలు కట్టడం కోసం మళ్ళీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొంది. కాళేశ్వరం అప్పు కట్టంకుంటూ పోతే 2036 లో పూర్తవుతుందని వెల్లడించింది.

మరోవైపు ప్రతీ సంవత్సరం 700 కోట్ల నుంచి 14 వేల 5 వందల కోట్ల వరకు ప్రాజెక్టు నిర్వహాణ కోసం ఖర్చు అవుతుందని తెలిపిన కాగ్.. కాళేశ్వరం 56 పనుల్లో 13 పూర్తి అయ్యాయయని మిగిలనవి పూర్తి కావాల్సి ఉందని పేర్కొంది. 2020-21లోనే రుణాల చెల్లింపు ప్రారంభం కావాల్సి ఉందని కానీ 9 ఆగ్రిమెంట్ లను వాయిదా వేయాలని కోరినట్టు చెప్పింది. వడ్డీలకు వడ్డీ కలవడం వల్ల 8 వేల182 కోట్లు పెరిగిందని తెలిపింది. కాళేశ్వరం కోసం తెచ్చిన రుణాలలో 1 వెయ్యి 690 కోట్లు దారి మళ్లించారని పేర్కొంది.

ఇలా చేయడం వల్ల అందనంగా 587 కోట్ల భారం వడ్డీ రూపంలో పడిందని తెలిపింది. ప్రతి ఏటా14 వేల 462 కోట్లు రుణాల చెల్లించాలని కాగ్ నివేదికలో చెప్పింది. 14 లక్షల ఎకరాలకు ఆయకట్టు ప్రస్తుత నిర్మాణం వరకు ఉందని చెప్పింది. ప్రాజెక్టు వ్యయం 122 శాతం పెరిగింది కానీ.. ఆయకట్టు 52లేకున్న 3 టీఎంసీలకు ప్రతిపాదన పెంచారని.. అందువల్ల.. 28 వేల151 కోట్ల అదనపు వ్యయం ఏర్పడ్డదని కాగ్ తెలిపింది.

కాళేశ్వరం నిర్వహణకు 10 వేల కోట్లు పడుతోందని తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయానికి అనుమతి ఇవ్వకుండా.. ఒక్కో పనికి అనుమతి ఇస్తూ పోయిందని తెలిపింది. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పోరేషన్ పేరుతో అందిన కాడికి అప్పులు తెచ్చిందని పేర్కొంది. మరోవైపు కాళేశ్వరంపై ఆదాయం లేదు కాబట్టి రుణాలు చెల్లింపు కష్టం అని కాగ్ హెచ్చరించింది. బడ్జెట్ పై భారం పడుతుందని తెలిపింది. వానాకాలం వచ్చే నీళ్లు వానాకాలం మాత్రమే సరిపోతాయని, యాసంగికి నీళ్లు సరిపోవని కాగ్ నివేదికలో చెప్పింది.

You may also like

Leave a Comment