Telugu News » America : అమెరికాలో గర్జించిన తుపాకులు.. కాల్పుల్లో ఒక‌రు మృతి.. 22 మందికి గాయాలు..!

America : అమెరికాలో గర్జించిన తుపాకులు.. కాల్పుల్లో ఒక‌రు మృతి.. 22 మందికి గాయాలు..!

ఈ ఘటనపై ద‌ర్యాప్తు చేప‌ట్టిన అధికారులు కాల్పుల‌కు గ‌ల కార‌ణాల‌ను ఆరాతీస్తున్నామని వెల్లడించారు. కాగా ఆట‌గాళ్లు, కోచ్‌లు, సిబ్బంది క్షేమంగా ఉన్న‌ట్లు కేన్సాస్ జ‌ట్టు ప్ర‌క‌టించింది. మరోవైపు అమెరికాలో గన్‌ కల్చర్‌లో రోజు రోజుకు జడలు విప్పుతోంది.

by Venu

అమెరికా (America)లో మ‌రోమారు తుపాకులు (Guns) గర్జించాయి. స్పోర్ట్స్ ప‌రేడ్‌ (Sports Parade)లో ర‌క్త‌పుటేరులు పారించాయి. మిస్సోరి రాష్ట్రం కేన్సాస్‌ సిటీలో స్పోర్ట్స్‌ పరేడ్‌పై దుండగులు విరుచుకుపడ్డారు. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, 22 మంది వరకు గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రుల్లో ఎక్కువగా చిన్నారులే ఉన్నారని.. వాళ్ల పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. కాల్పుల్లో గాయ‌ప‌డ్డ వారిని పోలీసులు స‌మీప ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించారు.

ఈ ప‌రేడ్‌లో వేలాది మంది పాల్గొన్నట్లు సమాచారం. అదే సమయంలో కాల్పులు జరగగా.. ఎటునుంచి దాడి జరుగుతుందో అర్థంకాక అక్క‌డికి వ‌చ్చిన వారు ప‌రుగులు పెట్టారు. మరోవైపు గత ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కేన్సాస్‌ (Kansas) జట్టు శాన్‌ఫ్రాన్సిస్కో(San Francisco)పై నెగ్గింది. దీంతో ఆ జట్టు విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. అయితే కాల్పులకు పాల్ప‌డ్డ ముగ్గురు అనుమానితుల‌ను అదుపులోకి తీసుకున్న‌ట్టు కేన్సాస్ సిటీ పోలీస్ చీఫ్ స్టేసీ గ్రేవ్స్ మీడియాకు వెల్ల‌డించారు.

ఈ ఘటనపై ద‌ర్యాప్తు చేప‌ట్టిన అధికారులు కాల్పుల‌కు గ‌ల కార‌ణాల‌ను ఆరాతీస్తున్నామని వెల్లడించారు. కాగా ఆట‌గాళ్లు, కోచ్‌లు, సిబ్బంది క్షేమంగా ఉన్న‌ట్లు కేన్సాస్ జ‌ట్టు ప్ర‌క‌టించింది. మరోవైపు అమెరికాలో గన్‌ కల్చర్‌లో రోజు రోజుకు జడలు విప్పుతోంది. దీంతో ఇలాంటి ఘటనలూ తరచూ చోటు చేసుకొంటున్నాయి. ఇప్పటి వరకు ఎందరో మరణించారు.. ఇక్కడ తుపాకి అంటే బొమ్మలా మారిందనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి..

ఇకపోతే గత ఏడాది.. ఎన్‌బీఏ ఛాంపియన్‌షిప్‌ విజయం నేపథ్యంలో కొలరాడోలోని డెన్వర్‌లో నిర్వహించిన ఫ్యాన్స్‌ సంబురాల్లో కూడా కాల్పులు జరిగాయి. ఆసమయంలో సుమారుగా పది మంది గాయపడ్డారు. అంతకు ముందు.. 2019లో టోరంటోలో జరిగిన కాల్పుల్లో నలుగురు గాయపడ్డారు.. ఇలా తూటాలకు బలి అవుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరగడం ఆందోళన కలిగిస్తున్న విషయం..

You may also like

Leave a Comment