ఏపీలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నేతల మధ్య మాటల వార్.. హిట్ పుట్టిస్తోంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే (MLA) వెలగపూడి రామకృష్ణ (Velagapudi Ramakrishna)పై ఎంపీ ఎంవీవీ (MP MVV) సత్యనారాయణ (Satyanarayana) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.. రంగాని అడ్డంగా నరికి చంపి పారిపోయిన వ్యక్తి వెలగపూడి.. అటువంటి వ్యక్తి ఇప్పుడు రంగులు మార్చి జనసేన అధినేత ఫోటో పెట్టుకుని కాపుల ముందుకు వెళుతున్నాడని దుయ్యబట్టారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత వెలగపూడి రామకృష్ణ ఏదో పీకుతాను అంటున్నాడని.. తన వెంట్రుక కూడా పీకలేడని మండిపడ్డారు. యాదవ సామాజిక వర్గాన్ని తొక్కేసిన వెలగపూడి అవకాశ వాదని ఆరోపించారు. తాను చేస్తున్న నిర్మాణ రంగంలో.. వెలగపూడిలా కల్తీ మద్యం అమ్మి ఎదగలేదని సత్యనారాయణ విమర్శించారు. వంగవీటి రంగా (Vangaveeti Ranga) హత్య కేసులో ముద్దాయి అయిన వెలగపూడి.. వంశీ ఇంటికి వెళ్ళి తనపై విమర్శలు చేయడం సిగ్గు చేటన్నారు.
తనపై గతంలో పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తే తిరిగి చేశాను తప్ప.. తాను ఎప్పుడూ అనవసరంగా విమర్శలు చేయనని సత్యనారాయణ తెలిపారు. ఎమ్మెల్యేగా రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయిన వంశీ.. విజయసాయి రెడ్డి దయ వల్ల కార్పొరేటర్ అయ్యారని పేర్కొన్నారు. వంశీ పై చెక్ బౌన్స్ కేసులు, ఆస్తుల అటాచ్మెంట్స్ ఉన్నాయని ఆరోపించారు. ఆయనకు మేకప్ వేస్తే బాబు మోహన్ కంటే తక్కువ స్థాయి కేరక్టర్ ఆర్టిస్ట్ లా ఉంటాడని విమర్శించిన ఎంపీ.. కుక్క కంటే దారుణమైన పంది జాతికి చెందిన వాడని దుయ్యబట్టారు.
మరోవైపు వెలగపూడి, రంగాను ఎలా చంపాడో బయట పెడతానని ఎంవీవీ సత్యనారాయణ హెచ్చరించారు. 2019లో వంశీకి టికెట్ దక్కకపోవడానికి తాను కారణం కాదని.. విషయం తెలీక వంశీ తనపై అనుమానం పెంచుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆరోపించారు. పార్టీ మారిన తర్వాత వంశీ అనేక సార్లు తనపై విమర్శలు చేసిన స్పందించలేదని తెలిపారు.