రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) సర్కార్ వచ్చాక భారీగా అధికారుల బదిలీలు చేపడుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ (IAS),ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది.
తాజాగా డిప్యూటీ కలెక్టర్ల (Deputy Collectors) బదిలీని కాంగ్రెస్ చేపట్టింది. రాష్ట్రంలో మొత్తం 25 మంది డిప్యూటీ కలెక్టర్ ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.
వరంగల్ అదనపు కలెక్టర్‌గా గట్టు సంధ్యారాణి, వనపర్తి అదనపు కలెక్టర్‌గా ఎం.నగేష్, నల్గొండ డీఆర్వోగా డి.రాజ్యలక్ష్మి, వరంగల్ డీఆర్వోగా కనుగుల శ్రీనివాస్, సంగారెడ్డి డీఆర్వోగా డి.పద్మజా రాణి
భద్రాద్రి రామాలయ ఈవోగా ఎల్.రమాదేవి బదిలీ చేసింది.
కీసర ఆర్డీవోగా కె.వెంకట ఉపేందర్‌రెడ్డి, రాజేంద్రనగర్ ఆర్డీవోగా కొప్పుల వెంకట్‌రెడ్డి, హుజూరాబాద్ ఆర్డీవోగా బి.శకుంతల, జహీరాబాద్ ఆర్డీవోగా ఎస్.రాజు,హైదరాబాద్ ఆర్డీవోగా కె.మహిపాల్, సికింద్రాబాద్ ఆర్డీవోగా ఆర్.దశరథ్ సింగ్ లకు స్థాన చలనం కలిగించింది.